/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pia-1-jpg.webp)
Pakistan International Airlines: పాకిస్థాన్(pakistan) రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నానాటికీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. తాజాగా తీవ్ర ఇంధన కొరత కారణంగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. 11 అంతర్జాతీయ, 13 దేశీ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(pakistan international airlines) ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో 12 విమానాల షెడ్యూల్స్ మార్చామని చెప్పారు. ప్రయాణికులు విమానాశ్రయాలకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించి.. విమానం రద్దు కాలేదని తెలిస్తేనే రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, బకాయిలు చెల్లించకపోవడంతో పీఐఏకు చమురు సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి.
ప్రభుత్వ చమురు సంస్థ పీఎస్ఓ నుంచి పీఐఏకు ఇంధనం సరఫరా అవుతుంది. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. ప్రతీ రోజు ఇంధనం కోసం రూ.100 మిలియన్లు అవసరం అవుతాయి. ఇన్నాళ్లూ అప్పు మీద ఇంధనం సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ ఉంటేనే సరఫరా చేస్తామని చెప్పడంతో పీఐఏ చేతులెత్తేసింది. పీఐఏ పూర్తిగా నష్టాల్లో ఉండటంతో పాటు భారీగా రుణభారం కూడా ఉన్నది.
Also Read: జొమాటో డెలివరీ గర్ల్ గా మిస్ మధ్యప్రదశ్..!!
మరోవైపు రుణభారం పెరిగిపోతుండటంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటు పరం చేయాలనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రోజువారీ ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని పీఐఏ కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థికం సంక్షోభంలో ఉన్న పాక్ ప్రభుత్వం పీఐఏ విన్నపాన్ని తిరస్కరించినట్లుగా సమాచారం. ఖజానా ఖాళీ కావడంతో పాక్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.