ఓటీటీ లవర్స్ కు పండగే ..ఈ వారం కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు..!!

ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి.

New Update
ఓటీటీ లవర్స్ కు పండగే ..ఈ వారం కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు..!!

OTT Movies of this weak:  ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ కు పండగే అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీ సెంటర్స్ లో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు .. సిరీస్ లే అడుగు పెడుతున్నాయి. 'నెట్ ఫ్లిక్స్' లో ఈ నెల 5వ తేదీ నుంచి ' మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి'(miss shetty mr polishetty) స్ట్రీమింగ్ కానుంది. వంశీకృష్ణ - ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించిన ఈ సినిమాలో, అనుష్క - నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇక ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లో 'ఖుఫియా' అందుబాటులోకి రానుంది. టబూ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్ ఇది.

publive-image

ఇక అక్టోబర్ 6వ తేదీన 'ఆహా'లో 'మిస్టర్ ప్రెగ్నెంట్' (mister pregnant)సినిమా స్ట్రీమింగ్ కానుంది. సోహెల్ - రూప జంటగా నటించిన ఈ సినిమా, థియేటర్స్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఇక అదే రోజున 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' సిరీస్ 'ఆహా' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు.

publive-image

అక్టోబర్ 6వ తేదీ నుంచి హాట్ స్టార్ లో 'లోకి' వెబ్ సిరీస్ .. అమెజాన్ ప్రైమ్ లో 'ముంబై డైరీస్' అందుబాటులోకి రానున్నాయి. అదే రోజున జీ5లో 'గదర్ 2' స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 8వ తేదీన అక్షయ్ కుమార్ 'OMG' నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించనుంది.

Also Read: ఆ సంచలన సినిమా సీక్వెల్ కు చిరు ప్లాన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Advertisment
తాజా కథనాలు