OTT Movies: ఇప్పుడు సినిమా కోసం థియేటర్ కి వెళ్లే పని లేదు. జస్ట్ రిమోట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇంట్లో కూచుని ఓటీటీలో బోలెడు సినిమాలు చూసేయవచ్చు. ఇన్ని సినిమాలు అందుబాటులో ఉంటే ఏ సినిమా చూడాలనే కన్ఫ్యూజన్ సహజమే. అలాగే, కొన్ని సినిమాలు ఇంట్లో అందరూ కలిసి చూసేవిధంగా ఉండవు. బోల్డ్ కంటెంట్.. డైలాగ్స్ కుటుంబం అంతా కలిసి చూస్తే ఇబ్బంది కలిగేలా ఉంటాయి. కానీ.. బోల్డ్ కంటెంట్ ఉన్నా సరే.. సినిమాలో మంచి విషయంపై చర్చ ఉండొచ్చు. లేదా ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని చెప్పే అద్భుత కథనం ఉండొచ్చు. కథ డిమాండ్ చేసిందని సహజ సిద్ధంగా ఉండాలని కొన్ని సినిమాల్లో బోల్డ్ కంటెంట్ దట్టిస్తారు. కొన్ని సినిమాలకు క్రేజ్ తేవడం కోసమూ కావాలని బోల్డ్ కంటెంట్ చొప్పిస్తారు. మంచి సినిమాని బోల్డ్ కంటెంట్ ఉందని మిస్ కాకూడదు అనుకుంటే, మీకో సినిమాని పరిచయం చేస్తాం. ఇది పాత సినిమానే. కానీ, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని అప్పట్లో పెద్దగా థియేటర్లలో ఆడలేదు. కానీ, ఇప్పుడు ఓటీటీలో ఉన్న బోలెడు బోల్డ్ కంటెంట్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కాస్త విషయం ఉన్నట్టు అనిపిస్తుంది.
Also Read: నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట
ఇప్పుడు చెబుతున్న సినిమా కాస్త ఘాటు ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనపుడు.. ఒక్కరే ఉన్నపుడు చూడదగ్గ సినిమా. ఎందుకంటే.. ఇందులో ఘాటు సీన్స్ ఎక్కువ ఉన్నా.. విషయం ఉంటుంది. యువతీ యువకుల మధ్య ప్రేమ కంటే శారీరక వాంఛలు ఎక్కువగా ఉంటున్నాయని.. ఆ కారణంగానే యువత చిక్కుల్లో పడుతోందని చెప్పే సినిమా ఇది. లైఫ్ అంటే.. వాంఛలు ఒకటే కాదనీ.. ప్రేమ.. గోల్స్.. ఇలా చాలా అంశాలు ఉంటాయనీ ఈ సినిమా చెబుతుంది. ఈ విషయాన్ని చెప్పడానికి మరీ అంత ఘాటు సీన్స్ తో సినిమా తీయాల్సిన అవసరం లేదు కానీ.. ఆలా తీసేసి జనాల మీదకు వదిలేశారు. అందుకే సినిమా కూడా హిట్ కాలేదు. తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని చెప్పడం లేదు కానీ, బోల్డ్ కంటెంట్ అంటే ఇష్టం ఉండి.. ఖాళీగా ఉండి.. ఏదైనా సినిమా చూడాలంటె.. నెట్ ఫ్లిక్ లాంటి ఓటీటీలు వెతక్కకుండా నేరుగా ఆహా ఓటీటీ (Aha OTT) ఓపెన్ చేసేయండి. అందులో ఈ సినిమా ఉంటుంది.
అన్నట్టు సినిమా పేరు చెప్పలేదు కాదు. అది డర్టీ హరి (Dirty Hari) . 2020 సంవత్సరంలో వచ్చింది ఈ మూవీ. ఈ మూవీలో శ్రవణ్ రెడ్డి, రుహాని శర్మ, సిమ్రత్ కౌర్, రోషన్ రెడ్డి, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి దర్శకత్వం వహించింది మరెవరో కాదు, ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పాడు. ఖాళీగా ఉంటే ఓ లుక్కేసేయండి టైమ్ పాస్ అయిపోతుంది.