Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కటింగ్స్ బంద్

New Update
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కటింగ్స్ బంద్

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్‌లోని ఐకానిక్‌ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట కేక్‌ కట్‌ చేయడం నిషేధిస్తునట్టు ప్రకటించారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీని పర్యాటక ప్రాంతంగా గుర్తించడంతో.. కేక్ కటింగ్ వల్ల వచ్చే చెత్తతో పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అర్థరాత్రి పూట ఆలస్యం కళాశాల భవనం ముందు కేక్‌లు కట్ చేయడం అనంతరం అక్కడ చెత్త వేయడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మహిళా విద్యార్థులు కూడా అర్థరాత్రి పూట జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని.. వారి భద్రతపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తున్నారు.

వారసత్వ కట్టడమైన ఆర్ట్స్ కాలేజీలో తాజాగా డైనమిక్ లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయడానికి 12 కోట్లు ఖర్చు చేశారు అధికారులు. అయితే కేక్ కటింగ్ బ్యాన్ చేయడంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. క్యాంపస్ పరిశుభ్రంగా ఉండేందుకు ఈ నిర్ణయం సరైందని కొందరు విద్యార్థులు అంటుండగా.. కేక్ కటింగ్ అనేది కాలేజీ కల్చర్‌లో భాగమని.. ఎవరికోసమో మా సంతోషాన్ని వదులుకోవాలా అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తార్నాక నుండి విద్యానగర్, అంబర్‌పేట్, అడిక్‌మెట్‌, ఫీవర్ హాస్పిటల్‌లను కలుపుతూ క్యాంపస్‌ మధ్యలో నుండి ఉన్న లింక్ రోడ్డును మూసే పనిలో ఉన్నారు అధికారులు. టైమ్‌తో పాటు ట్రాఫిక్ సమస్యను తగ్గించే ఈ మార్గంలో.. వాహనాల రాకపోకల వల్ల క్యాంపస్‌లోని స్టూడెంట్స్‌ కు ఇబ్బందికరంగా మారింది. అంతేగాక క్యాంపస్‌లోని ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. దీంతో ఈ రోడ్డును మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా 16.50 కోట్ల రూపాయలతో ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మిస్తామని ఐటీ, పట్టణాభివృద్దిశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్దికి 144కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే క్యాంపస్‌లో వాహనాలను అనుమతిస్తున్నారు. అతి త్వరలో ఆ అవకాశం కూడా ఉండదు.

ఇది కూడా చదవండి: రెండేళ్ల క్రితం అమెరికాలో శపథం.. ఇప్పుడు నెరవేర్చిన మాజీ ఎంపీ

Advertisment
తాజా కథనాలు