Oscar 2024: ఆస్కార్‌ వేదిక మీదకు బట్టలు లేకుండా వచ్చిన స్టార్‌ రెజ్లర్‌!

ఆస్కార్‌ వేదిక మీదకు స్టార్ రెజ్లర్ జాన్ సీనా నగ్నంగా రావడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటనతో పలువురు నెటిజన్లు ఆయనను విమర్శిస్తున్నారు.

New Update
Oscar 2024: ఆస్కార్‌ వేదిక మీదకు బట్టలు లేకుండా వచ్చిన స్టార్‌ రెజ్లర్‌!

Oscar Awards 2024:ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు ఎంతో ఆసక్తిగా చూసే వేడుక ఆస్కార్‌ అవార్డుల వేడుక. అయితే ప్రతి సారి ఆస్కార్ అవార్డుల వేడుక ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. ఒకసారి వేదిక మీద చెప్పుతో ఘటన ఒకటి సంచలనం కాగా, మరోసారి వేదిక మీద లిప్‌ కిస్‌ చేసి వివాదంలో నిలిచింది.

ఇప్పుడు తాజాగా స్టార్ రెజ్లర్ జాన్ సీనా చేసిన పనికి యావత్‌ ఆస్కార్‌ వేదిక ఉలిక్కిపడింది. ఎందుకంటే జాన్ సీనా వేదిక మీదకి నగ్నంగా వచ్చాడు. ఈ సారి అవార్డుల్లో బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కి అవార్డు అనౌన్స్ చేసే అవకాశం జాన్‌ సీనాకు వచ్చింది. యాంకర్ ఆయన పేరును పిలవగానే ఆయన ప్రైవేట్‌ పార్ట్‌ కు విజేత పేరు ఉన్న కార్డును అడ్డు పెట్టుకుని స్టేజీ మీదకు వచ్చాడు.

దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అంతే కాకుండా అందరూ నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ గా మారింది. అలా రావడంతో పాటు నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ఎంతో అవసరమో అంటూ నవ్వులు పూయించాడు. ఈ క్రమంలోనే వేదిక మీద విజేతల లిస్టులో ఉన్న వారి పేర్లను ప్రదర్శిస్తుంటే లైట్లను తీసేశారు.

ఆ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి జాన్ సీనా కు గబగబా బట్టలు వేసేశారు. ఆ తరువాత జాన్ సీనా విజేతను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ విషయం నెటిజన్లు నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.

Also read: నాతో కలిసి రండి.. ఆ రోజే వైసీపీలోకి వెళ్తున్నా: ముద్రగడ!

Advertisment
తాజా కథనాలు