One Biscuit Cost Rs.1 lakh : వామ్మో..ఒక్క బిస్కెట్ రూ.లక్ష..!

సన్‌ఫీస్ట్ కంపెనీకి వినియోగదారుల కోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. బిస్కెట్‌ ప్యాకెట్లలో ఒక బిస్కెట్‌ పీస్‌ తక్కువ పెట్టిన సన్‌ఫిస్ట్‌కి లక్ష రూపాయల జరిమానా విధించింది. తమిళనాడు మాథుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ కేసు వేశాడు. కోర్టు విచారణలో సన్‌ఫిస్ట్ చాలా ప్యాకెట్లలో ఇదే తరహా మోసానికి పాల్పడుతున్నట్టు తేలింది.

One Biscuit Cost Rs.1 lakh : వామ్మో..ఒక్క బిస్కెట్ రూ.లక్ష..!
New Update

One Biscuit Cost Rs.1 lakh:  ఒక చిన్న పొరపాటు మనకు పెద్దగా అనిపించదు..కానీ శిక్ష పడితేగాని తెలియదు అమ్మో అంత పెద్ద తప్పు చేశామా? అని. సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్‌లో జస్ట్ ఒక బిస్కెట్ తక్కువ అయింది. అంతే దీనికి కస్టమర్ కోర్టు ఫైన్ ఎంత వేసిందే తెలిస్తే షాక్ అవ్వల్సిందే. చెన్నైలోని MMDA మాథుర్‌కు చెందిన వ్యక్తికి జంతువులంటే ఎంతో ఇష్టం. వాటికి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మనాలి రిటైల్ స్టోర్ నుంచి రెండు బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే అతను పాక్యెట్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. పాక్యెట్లో పదహారు బిస్కెట్లు ఉండాల్సింది పోయి కేవలం పదిహేను మాత్రమే ఉండడంతో ఆశ్చర్యానికి గురైయ్యాడు.

డిల్లీబాబు తన స్థానిక స్టోర్, ITC నుంచి వివరణ కోరేందుకు ప్రయత్నించారు. కానీ వారి నుండి సరైన సమాధానం రాలేదు. ప్రతి బిస్కెట్ ధర 75 పైసలు అని నొక్కి చెప్పడంతో అతడు విసుగు చెందాడు. దీంతో వినియోగదారుల కోర్టులో (Consumer court) ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో, కంపెనీ రోజుకు దాదాపు 50 లక్షల ప్యాకెట్లను తయారు చేస్తున్నందున,ITC ప్రజల నుంచి దాదాపు రోజుకు 29 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: మంచినీళ్లు అతిగా తాగితే ఏం అవుతుందో తెలుసా?

publive-image

లోపల ఉన్న బిస్కెట్లు సంఖ్య కాకుండా, ఉత్పత్తి దాని బరువు ఆధారంగా విక్రయించబడుతుందని FMCG... కోర్టులో తన వాదనలు వినిపించింది. ఉత్పత్తి  ప్రకటన నికర బరువు 76 గ్రాములు అని పేర్కొంది. అయితే, పరిశీలించగా, అది కేవలం 74 గ్రాముల బరువు మాత్రమే ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. ITC చట్టపరమైన ప్రాతినిధ్యం 2011 నాటి లీగల్ మెట్రాలజీ నియమాలను సూచిస్తుంది. ఇది ముందుగా ప్యాక్ చేసిన వస్తువులకు గరిష్టంగా 4.5 గ్రాముల అనుమతించదగిన లోపాన్ని అనుమతిస్తుంది. అయినప్పటికీ, న్యాయమూర్తి అంగీకరించలేదు. ఈ నియమం ప్రకృతిలో 'అస్థిరత'గా పరిగణించబడే వస్తువులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. వాదనలు విన్న కోర్టు రూ.1 లక్ష ఫైన్ వేసింది. దీంతో సన్ ఫిస్ట్ కి మైండ్ బ్లాక్ అయ్యింది.

Also Read: బండి సంజయ్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. రూ.50 వేల జరిమానా

#one-biscuit-cost-rs-1-lakh #itc-fined-rs-1-lakh #itc-ordered-to-pay-rs-1-lakh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe