AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్.. అక్రమనిర్మాణాలపై కొరడా..! కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 06 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Dwarampudi Chandrasekhar Reddy: ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం కూల్చుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్‌గా వరుస దాడులు జరుగుతున్నాయి. కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. అక్రమ బియ్యం దందా, అక్రమ నిర్మాణాలు, ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌లపై అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. Also Read: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే! ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్‌పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థ జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందట అక్రమ రేషన్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపారు. సివిల్ సప్లైశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రైస్‌మిల్లుల గోడౌన్‌లో తనిఖీలు చేశారు. Also Read: విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత వారిదే: చలసాని శ్రీనివాస్ ద్వారంపూడి అనుచరుల 8 గోడౌన్లు సీజ్ చేశారు. అంతేకాకుండా 35వేల టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడలో ద్వారంపూడి అనుచరుల అక్రమనిర్మాణాలపై కొరడా విధిస్తున్నారు. బళ్లా సూరిబాబుకి చెందిన రెండు అంతస్తుల భవనం కూల్చివేశారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ద్వారంపూడిపై కేసు కూడా నమోదు చేశారు. #dwarampudi-chandrasekhar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి