ODI World Cup 2023: పాకిస్థాన్ కెప్టెన్ వాట్సాప్ ఛాటింగ్ లీక్.. అందులో ఏముందంటే..!

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌ అజమ్, పీసీబీ చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నజీర్ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ లీక్‌ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. పాక్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ అజమ్.. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‌ను కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాడని, కానీ అష్రాఫ్ కాంటాక్ట్ అవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అష్రాఫ్.. బాబర్ అసలు తనను కాంటాక్ట్ అవ్వలేదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పాడు.

ODI World Cup 2023: పాకిస్థాన్ కెప్టెన్ వాట్సాప్ ఛాటింగ్ లీక్.. అందులో ఏముందంటే..!
New Update

PCB Chief Zaka Ashraf: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ టీమ్(Pakistan Team) పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ టీమ్.. నాలుగు మ్యాచ్‌లో ఓడిపోయి రెండింట్లో మాత్రమే గెలుపొందింది. -0.387 పాయింట్స్‌లో టేబుల్‌లో 7వ స్థానంలో ఉంది. ఇక తన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు పాక్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్. మ్యాచ్‌ల్లో ఓటమికి అతన్ని బాధ్యుడిని చేస్తూ.. పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస ఓటములు, విమర్శలతో సతమతం అవుతున్న కెప్టెన్‌కు బాసటగా నిలుస్తున్నారు పాక్ మాజీ క్రికెటర్లు. కెప్టెన్‌ను ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇక వీరిలో రషీద్ లతీఫ్.. ఓ అడుగు ముందుకేసి పాక్ క్రికెట్ బోర్డుపై విమర్శలు గుప్పించాడు. అంతేకాదు.. పీసీబీ చీఫ్ జాకా అష్రాఫ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. జాకా అష్రాఫ్‌ను కాంటాక్ట్ అవ్వడానికి బాబర్ ఆజమ్ ప్రయత్నిస్తున్నాడని, కానీ అష్రాఫ్ మాత్రం స్పందించడం లేదని ఆరోపించాడు.

ఈ కామెంట్స్ సంచలనం సృష్టించగా.. ఎట్టకేలకు స్పందించాడు పీసీబీ చీఫ్ అష్రాఫ్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పీసీబీ చీఫ్ ఆష్రాఫ్.. బాబర్ అసలు తనన కాంటాక్ట్ అవ్వలేదని, ప్రయత్నం కూడా చేయలేదని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని అన్నాడు. అంతేకాదు.. బాబర్ ఆజమ్‌కు సంబంధించిన పర్సనల్ చాట్స్‌ను కూడా రివీల్ చేశాడు అష్రాఫ్. దాంతో ఈ మ్యాటర్ పెద్ద సెన్షన్‌గా మారింది.

అయితే, అష్రాఫ్ చేసిన పనిపై పాక్ మాజీ క్రికెటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఒక ప్లేయర్ పర్సనల్ చాట్స్‌ను బయటపెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. ఒక ఆటగాడి పర్సనల్ చాట్‌ను ఎలా లీక్ చేస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దిగజారుడుతనానికి నిదర్శనం అని ఫైర్ అయ్యారు.

అందుకే పీసీబీ చీఫ్‌ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నాడు..!

ఇదిలాఉంటే.. పాకిస్థాన్ జట్టుకు పీసీబీ నుంచి సరైన సహకారం అందడం లేదని ప్రచారం జరుగుతోంది. గత 5 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదట. ఈ కారణంగానే పీసీబీ చీఫ్‌ అష్రాఫ్‌తో బాబర్ అజమ్ మాట్లాడాలని ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే.. ప్రపంచకప్ టోర్నీ అనంతరం.. బాబర్ కెప్టెన్సీపై వేటు పడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

వరుస ఓటములు..

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దాయాది దేశం పాకిస్థాన్ ఆట తీరు అత్యంత దారుణంగా ఉంది. టీమిండియాతో మ్యాచ్ తర్వాత వరుస ఓటములు ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియాతోనే కాదు.. ఏకంగా ఆప్ఘనిస్తాన్ వంటి జట్టుపై కూడా పాకిస్తాన్ టీమ్ ఓడిపోయింది. మొత్తం ఆడిన ఆరు మ్యాచ్‌లో రెండింట్లో మాత్రమే గెలుపొందింది.

Also Read:

శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

#babar-azam #pcb-chief-leaks-babar-azams-private-chats #pcb-chief
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe