Nupur Sanan: సౌత్ లో తనకు మంచి లాంఛింగ్ సినిమా దొరికిందని ఆనందంగా చెబుతోంది నుపుర్ సనన్(Nupur Sanan). కృతి సనన్ చెల్లెలిగా చాలామందికి తెలిసిన ఈ బ్యూటీ, ఇకపై తనను టైగర్ నాగేశ్వరరావు హీరోయిన్ గా గుర్తుపెట్టుకుంటారని అంటోంది. ఈ సినిమా చేయడం తన అదృష్టం అంటోంది.
"మాస్ మహారాజా రవితేజ సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 లాంటి పాన్ ఇండియా విజయాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను యాప్ట్ గా ఉంటానని ఆయన బిలీవ్ చేయడం నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది."
ఇలా తనకు మంచి హీరో, బ్యానర్, దర్శకుడు సెట్ అయ్యాయని చెప్పుకొచ్చింది నుపూర్ సనన్. రవితేజ(Ravi Teja) నటించిన సినిమాలన్నీ చూశానంటున్న ఈ బ్యూటీ.. రవితేజ సపోర్ట్ ను మరిచిపోలేనంటోంది.
"రవితేజ నటించిన దాదాపు అన్ని సినిమాలు చూశాను. రవితేజ ఒరిజినల్ విక్రమ్ రాథోడ్. రవితేజ యాక్టింగ్ అమేజింగ్. ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. మాస్ మహారాజా టైటిల్ రవితేజ గారికి యాప్ట్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన హిందీ చాలా అద్భుతంగా ఉంటుంది. షూటింగ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఆయన వలన నాకు లాగ్వెంజ్ సమస్య ఎదురుకాలేదు."
అక్క కృతి సనన్ జర్నీ కూడా తెలుగు నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు తన ప్రయాణం కూడా టాలీవుడ్ నుంచే మొదలైందని చెప్పుకొచ్చిన నపురు.. తాము సిస్టర్స్ అయినప్పటికీ, తమ ఇద్దరి అభిరుచులు వేర్వేరు అంటోంది. అక్క తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.