/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-11T182826.063-jpg.webp)
Jr NTR Lands in Mumbai for War 2 Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న వార్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో యంగ్​ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 2018 అరవింద సమేత చిత్రం తర్వాత RRR సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకులు ముందుకువచ్చాడు. ఈ మూవీతో NTR పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే వార్ 2 అప్డేట్ ప్రకటించినప్పటి నుంచి హృతిక్, ఎన్టీఆర్ కలిసి షూటింగ్​లో పాల్గొన్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఆతృుతగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికీ అభిమానుల ఆశ తీరనుంది. ఒక 10 రోజుల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ తాజాగా ముంబయికి చేరుకున్నారు. ఏప్రిల్ 12 నుంచి షూటింగ్​ సెట్స్​లో తారక్ అడుగుపెట్టనున్నారట. అయితే ముంబయికి చేరుకోగానే మీడియా ఎన్టీఆర్​ను చుట్టుముట్టేసింది. ఫ్యాన్స్ అంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కానీ తారక్​ దూరం నుంచే వాళ్లను చూసి ఫొటోలకు పోజులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక ఎన్టీఆర్ నటించనున్న ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు చాలా ముఖ్యమైన సీన్స్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి హృతిక్, తారక్ ఇద్దరూ వంద రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల షూటింగ్ తర్వాత మళ్లీ తన షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబకు వస్తారా లేదా ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆ కాల్ షీట్స్ ఇచ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం కోసం హృతిక్, తారక్ ఇద్దరూ వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తేలాల్సి ఉంది. మూవీలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్​గా కనిపించనున్నారట. హృతిక్​తో పాటు ఎన్టీఆర్ పాత్రకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
#JrNTR just reached to Mumbai to shoot several action sequences for #HrithikRoshan starrer #War2.@tarak9999 to shoot an important sequence for a span of 10 days.
Jr NTR will directly join Hrithik Roshan for filming the crucial scene. pic.twitter.com/xOCAm9Rehl
— Ashwani kumar (@BorntobeAshwani) April 11, 2024
ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ చివరకి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్​ఆర్​ఆర్​ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు. అందుకే హిందీ ఆడియెన్స్​ను ఆకట్టుకోవడానికి దేవర సినిమాలో హీరోయిన్​గా జాన్వీ కపూర్​తో పాటు కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్​ను తీసుకున్నారు. వార్ 2 ప్రస్తుత షెడ్యూల్ పది రోజులు పూర్తి కాగానే మళ్లీ దేవర షూటింగ్​లో పాల్గొంటారు ఎన్టీఆర్.
Also Read: టాప్ యంగ్ గేమర్స్‌తో కలిసి గేమ్స్ ఆడిన ప్రధాని మోదీ..