NTR Health University: అది 2021.. సెప్టెంబర్ 20, నాటి జగన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో యావత్ తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకున్న రోజు అది. విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును YSR హెల్త్ యూనివర్శిటీగా మార్చుతూ అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే పేరును మార్చేసింది. దీంతో తెలుగు దేశం కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున బయటకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. అయితే సీన్ కట్ చేస్తే కథ మళ్ళీ మారింది. పాత పేరే తిరిగి వచ్చింది. YSR హెల్త్ యూనివర్శిటీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ టీడీపీ-జనసేన-బీజేపీ కేబినెట్ డిసిషన్ తీసుకుంది!
NTR Health University: వైద్య విద్యకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఉండాలన్న లక్ష్యంతో 1986లో ఎన్టీఆర్ విజయవాడలో హెల్త్ యూనివర్శిటీని ప్రారంభించారు. తమిళనాడు, కర్ణాటక యూనివర్శిటీలను పరిశీలించి... మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉండాలని నిర్ణయించిన ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 1986 నవంబర్ 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరిట ఆరోగ్య విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ మరణాంతరం చంద్రబాబు హయాంలో 1998 జనవరి 8న స్పెషల్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా యూనివర్శిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చారు.
NTR Health University: 2001లో యూనివర్శిటీ రజతోత్సవం సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న పురందేశ్వరీ..వర్సిటీ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ టైమ్‌లోనూ ఈ యూనివర్శిటీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ చేర్చారు వైఎస్సార్. 2006 జనవరి 8న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పేరు మార్చారు.
NTR Health University: ఇక డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ 2021 సెప్టెంబర్‌లో మంత్రి విడుదల రజిని ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక ఆ తర్వాత నవంబర్‌లో ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందింది. నాటి వైసీపీ సర్కార్ నిర్ణయం ఎన్టీఆర్‌ను అవమానించేలా ఉందని టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు తొలగింపును తీవ్రంగా తప్పుబట్టారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అయినా వైసీపీ తన పని తాను చేసుకుపోయింది. జిల్లాల విభజనలో భాగంగా విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రాంతాలకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేసింది.
NTR Health University: ఇక మూడేళ్లు గడిచేలోపు కథ మొత్తం మారిపోయింది. నాడు 175 స్థానాలకు 151 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఏపీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. ఇటు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పలు పథకాల పేర్లు మార్చుతోంది. ఇక ముందుగా ఊహించినట్టుగానే హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరును తొలగించి ఎన్టీఆర్ పేరును పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.