DK Aruna:ఇప్పుడు గద్వాలకు నేనే ఎమ్మెల్యేను!!

ఇప్పుడు గద్వాలకు నేనే ఎమ్మెల్యేను అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వెల్లడించారు. చట్టం తన పని తాను చేస్తుందని.. సుప్రీం కోర్టులో కూడా నాకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే తీర్పు చాలా ఆలస్యంగా వచ్చిందని.. అయినా న్యాయమే గెలిచిందని అరుణ పేర్కొన్నారు.

New Update
DK Aruna:ఇప్పుడు గద్వాలకు నేనే ఎమ్మెల్యేను!!

DK Aruna: ఇప్పుడు గద్వాలకు నేనే ఎమ్మెల్యేను అని బీజేపీ నాయకురాలు డీకే అరుణ వెల్లడించారు. చట్టం తన పని తాను చేస్తుందని.. సుప్రీం కోర్టులో కూడా నాకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే తీర్పు చాలా ఆలస్యంగా వచ్చిందని.. అయినా న్యాయమే గెలిచిందని అరుణ పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో కూడా కృష్ణమోహన్ రెడ్డి అక్రమంగా గెలిచారని ఆమె ఆరోపించారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు వారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలంతా హై కోర్టు తీర్పుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు డీకే అరుణ. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా విజయం నాదేనన్నారు ఆమె.

హైకోర్టు తీర్పులో ఏముందంటే..!

గద్వాల ఎమ్మెల్యేగా ఉన్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని డీకే అరుణ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. దీనిపై అపటి నుంచి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో హైకోర్టు ఎమ్మెల్యే పై అనర్హత వేటు వేసింది. దీంతో సెకండ్ ప్లేస్ లో ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ధర్మాసనం ప్రకటించింది.

అంతే కాదు తప్పుడు వివరాలు సమర్పించినందుకు కృష్ణ మోహన్ రెడ్డికి 3 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. అందులో నుంచి 50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

చిక్కులో బీఆర్ఎస్..!

అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల నియోజకవర్గం నుంచి ఈ సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డినే ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో ఆయన అనర్హత వేటు పై హైకోర్టు వేటు వేయడం గమనార్హం. మరి ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వనమా వెంకటేశ్వర్లు ఇంకా శ్రీనివాస్ గౌడ్ ఎంపిక కూడా వివాదంగా మారింది.

Advertisment
తాజా కథనాలు