వేపాకుతో అద్భుతమైన ప్రయోజనాలు..

వేపాకు చర్మం నుండి జుట్టు వరకు బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇవన్నీ కామన్ గా అందరికీ తెలిసిన విషయాలే.. కానీ వేప వల్ల చాలామందికి తెలియని ఆశ్చర్యపోయే నిజాలేంటంటే..

New Update
వేపాకుతో అద్భుతమైన ప్రయోజనాలు..

వేపాకులు ఉపయోగించడం వల్ల ముఖం మీద మచ్చలు నివారించవచ్చు. ముఖం మీద తెల్లమచ్చలు(White heads), నల్లమచ్చలు(black heads) తగ్గించడంలోనూ, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్‌ చేయడంలో సహాయపడుతుంది.చర్మసంరక్షణకు విటమిన్-ఇ(vitamin-E) మంచిదని అందరికీ తెలిసిందే. అయితే వేపలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే ముఖం మీద ముడతలు, గుంటలు తొలగిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే వేప గొప్ప యాంటీఏజింగ్ పదార్థం.

మొటిమలను(Pimples) తగ్గించడానికి వేప అద్భుతంగా పనిచేస్తుంది. వేపలో యాంటీ బ్యాక్టీరిల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మం మీద దురదను, మొటిమల ప్రభావాన్ని తగ్గిస్తాయి.వేపలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఆక్సీకరణ ద్వారా కలిగే ఒత్తిడిని నియత్రిస్తాయి. ఇది కాలేయం(Liver), మూత్రపిండాలు(Kidney) ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

వేప పుల్లతో పళ్లు తోముకోవడం(teeth brushing) వల్ల పళ్లు పటిష్టంగా ఉంటాయి. ఇది దంతక్షయం, చిగురు వాపు వంటి నోటి సంబంధిత సమస్యలను కూడా దూరంగా ఉంచుతుంది.వేపలో ఒలీక్, స్టెరిక్, లినోలెయిక్ యాసిడ్‌లతో సహా కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా(skin health) ఉంచుతాయి.

వర్షాకాలంలో జుట్టు సంబంధ సమస్యలు(Hair problem) చాలా ఎక్కువగా ఉంటాయి. చుండ్రు, దురదలు, పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే వేపలో ఉంటే నింబ్డిన్ అనే పదార్థం ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.వేపలో ఉండే నింబ్డిన్, నింబోలైడ్ అనే పదార్థాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి.

Advertisment
తాజా కథనాలు