Nitin Gadkari: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సు ఎక్కిన కేంద్ర మంత్రి..!!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఓవర్ హెడ్ పవర్ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోస్‌ ను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Nitin Gadkari: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సు ఎక్కిన కేంద్ర మంత్రి..!!
New Update

Nitin Gadkari: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ యూరప్ దేశం చెక్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఓవర్ హెడ్ పవర్ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో టెస్ట్ రైడ్ లో పాల్గొన్నట్టు ఆయన వెల్లడించారు. ప్రేగ్ నగరంలో ఈ టెస్ట్ రైడ్ చేపట్టారని వివరించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన  సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ బస్సు పొడవు 24 మీటర్లు. చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కొడా ఈ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ బస్సు ప్రయోగాత్మక దశలో ఉందని గడ్కరీ తెలిపారు. ఒక్కసారి ఇది రోడ్డెక్కితే, మెట్రో నగరాల్లో రవాణా ఎంతో చవకగా మారుతుందని వివరించారు. మెట్రో రైళ్ల మాదిరిగా ఈ బస్సులకు ప్రత్యేక ట్రాక్ లైన్లు ఉంటాయని, ఇవి నగరాల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా ప్రత్యామ్నాయాలుగా మారతాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు.ఇలాంటి బస్సులతో ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను మరింత విస్తరించవచ్చని  మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

Also Read: పాపం ట్రంప్.. కోర్టులో ఎలా కూర్చున్నాడో చూడండి!

#nithin-gadkari
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe