New Year Party: ఇలా చేస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు..!

మరికొద్ది రోజుల్లో న్యూఇయర్ రాబోతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అయితే, పార్టీ తరువాత హ్యాంగోవర్ కాకుండా ఉండాలంటే తాగే డ్రింక్‌లో ఐస్, ఏదైనా జ్యూస్ కలిపి తాగితే బెటర్ అంటున్నారు నిపుణులు.

New Year Party: ఇలా చేస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు..!
New Update

New Year Celebrations 2024: న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడానికి యావత్ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. మరికొద్ది రోజులే సమయం ఉండటంతో డేస్ లెక్కపెట్టుకుంటున్నారు జనాలు. అయితే, డిసెంబర్ 31 రాత్రి, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. కొందరు కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొందరు స్నేహితులతో పార్టీలు చేసుకుంటారు. ఇంకొందరు హోటళ్లు, క్లబ్బులు లేదా బయట ఎక్కడైనా న్యూ ఇయర్ పార్టీలకు హాజరు కావడానికి ఇష్టపడతారు.

ఇంట్లో అయినా, బయట అయినా ప్రజలు ఈ సందర్భాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు. వారు వారికి ఇష్టమైన డ్రింక్స్, ఫుడ్స్ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. ఆటలు, పాటలు, డ్రింక్స్ దుమ్మురేపుతారు. న్యూ ఇయర్ వేడుకలను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అయితే, న్యూ ఇయర్ పార్టీలలో డ్రింక్స్ తాగే వ్యక్తులు మరుసటి రోజు హ్యాంగోవర్‌కు భయపడతారు. ఈ హ్యాంగోవర్ రాకుండా ఉండేందుకు కొన్ని నేచురల్ చిట్కాలు సూచిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. తాగే డ్రింక్‌లో కొన్ని జ్యూస్‌లు కలుపుకుని తాగితే మేలని చెబుతున్నారు. మరి హ్యాంగోవర్‌ను తగ్గించే ఆ డ్రింక్స్ ఏంటో ఓసారి చూద్దాం..

'షాట్ ఇన్ ది డార్క్'..

చల్లని వాతావరణంలో వేడి టీ, కాఫీ తాగే.. ఆ ఆనందమే వేరు. అయితే టీలో ఒక షాట్ లిక్కర్ కలిపి తాగొచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును, దీనిని 'షాట్ ఇన్ ది డార్క్' అని పిలుస్తారు. చాలా చోట్ల ఇది ప్రజాదరణ పొందింది. ఈ డ్రింక్ శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, కొద్దిగా మత్తును కూడా ఇస్తుంది. మీరు పార్టీలో ఈ డ్రింక్‌ని ఆస్వాదించవచ్చు. ఇది హ్యాంగోవర్‌ను కూడా తగ్గిస్తుంది.

ఐస్‌డ్ టీ..

ఐస్‌డ్ టీలో.. వోడ్కా, రమ్, జిన్ మొదలైన వాటిలో కొద్దిగా కోలా, నిమ్మరసం కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ కంటెంట్ కాస్త తగ్గుతుంది. టేస్ట్ కూడా మెరుగవుతుంది. ఇది తాగితే పార్టీ తర్వాత హ్యాంగోవర్ కూడా ఉండదంటున్నారు.

జ్యూస్ రమ్..

జ్యూస్‌లో లైట్ రమ్ కలిపి తాగొచ్చు. నారింజ, కొబ్బరి నీరు, పైనాపిల్ జ్యూస్ మొదలైన ఏదైనా పండ్ల రసానికి కొద్దిగా లైట్ రమ్ కలిపి తాగొచ్చు. ఇది రిఫ్రెష్, రుచికరమైన మాక్‌టైల్‌గా ఉంటుంది. ఇందులో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉన్నందున, హ్యాంగోవర్ టెన్షన్ కూడా ఉండదు. పార్టీని ఎంజాయ్ చేయొచ్చు.

జింజర్ బీర్ డాష్..

జింజర్ బీర్, బకార్డి రమ్ కలయిక సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది. అల్లం బీర్ చేదు రుచి, బకార్డి రమ్ తీపి మిక్స్ అవడం వల్ల కొత్త రుచికరమైన టేస్ట్ వస్తుంది. ఈ డ్రింక్ లో ఆల్కహాల్ కూడా తక్కువే. ఇందులో కాస్త ఐస్ వేసుకుని తాగొచ్చు. హ్యాంగోవర్ సమస్యే ఉండదు.

గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు పైన పేర్కొన్న వివరాలు ఇవ్వడం జరిగింది. దీనిని RTV ధృవీకరించడం లేదు.

Also Read:

సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!

 హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

#new-year-celebrations-2024 #new-year-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe