/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Fmpdo.jpg)
AP: నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన ఏలూరు కాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిన్న ఏలూరు కాల్వ సమీపంలో ఒక వ్యక్తి దూకినట్టు స్థానికులు చెప్పడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు తనని వేధించాడని, నిన్న లేఖ రాసి ఇంటి నుండి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది.