SIM Cards : సిమ్ కార్డు తీసుకునే వారికి జనవరి 1 నుంచి కొత్త రూల్! వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి కొత్త సిమ్ కార్డులు తీసుకునే వారికి కొత్త రూల్స్ రానున్నాయి. ఇక నుంచి సిమ్ కార్డు తీసుకునే వారికి డిజిటల్ కేవైసీ ద్వారా పూర్తి వివరాలను తీసుకొనున్నట్లు టెలికాం విభాగం తెలిపింది. By Bhavana 07 Dec 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి New SIM Card Rule For New Users : వచ్చే ఏడాది మొదటి రోజు నుంచి కూడా సిమ్ కార్డు (SIM Card)ల విషయంలో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు సిమ్ కార్డులను తీసుకోవాలంటే కేవైసీ వెరిఫికేషన్ పేపర్ సంబంధించి ఉండేది..ఇక నుంచి ఆ పద్దతిని నిలిపివేస్తున్నట్లు టెలికాం విభాగం (Telecom Department)పేర్కొంది. పేపర్ బదులు డిజిటల్ వెరిఫికేషన్ తీసుకుని వస్తున్నట్లు వివరించింది. ఈ విధానాన్ని గురించి ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్, ఐడియా కంపెనీలు సంతోషం తెలిపాయి. ఇలా చేయడం వల్ల సిమ్ కార్డు మోసాలను సైతం ఆరికట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం సిమ్ కార్డుల జారీకి ఫారం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ఆ వ్యక్తికి సంబంధించిన గుర్తింపు పత్రాలు, ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే కొన్ని కంపెనీలు డిజిటల్ విధానాన్ని పాటిస్తున్నాయి. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని పాటిస్తూ ..పేపర్ విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు టెలికాం విభాగం తెలిపింది. డాట్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల టెలికాం కంపెనీలకు మేలు జరగనుంది. పేపర్ లేస్ విధానం వల్ల కస్టమర్ ను చేర్చుకునేందుకు కంపెనీలకు ఖర్చు తగ్గుతుందని కంపెనీలు చెప్తున్నాయి. ఇక నుంచి కంపెనీలు అన్ని కూడా పూర్తిగా మొబైల్ తోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలను ఆరికట్టేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న కొన్ని చర్యల్లో భాగంగా కొత్తగా ఈ డిజిటల్ విధానాన్ని తీసుకుని వచ్చింది. Also read: జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు #simcards #kyc #digital-kyc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి