కొత్త పోస్టర్.. కొత్త విడుదల తేదీ

మరో చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మొన్నటివరకు స్కంద సినిమాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. రిలీజ్ కు వారం ముందు పోటీ ఉండేది. కానీ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ నెల 28న స్కంద మూవీ రిలీజ్‌ కానుంది.

New Update
కొత్త పోస్టర్.. కొత్త విడుదల తేదీ

మొన్నటివరకు స్కంద సినిమాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. రిలీజ్ కు వారం ముందు పోటీ ఉండేది. రిలీజ్ తర్వాత కూడా వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండేది. అలాంటి టైమ్ పొజిషన్ లో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. కానీ ఊహించని విధంగా సలార్ సినిమా స్కిప్ అవ్వడంతో, స్కంద సినిమాకు అదృష్టం కలిసొచ్చింది. వెంటనే సలార్ తేదీకి తమ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం బెస్ట్ డేట్ ని లాక్ చేశారు. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

స్కంద గురువారం విడుదల కానుంది కాబట్టి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉంది. వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం నాడు గాంధీ జయంతి పడింది. దసరా సెలవులు కూడా కలిసిరాబోతున్నాయి. ఈ రకంగా ఈ హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్ కి ఇది పర్ ఫెక్ట్ డేట్ గా మారింది. రిలీజ్ డేట్ ప్రకటనలో భాగంగా అందమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రామ్, శ్రీలీల చిరునవ్వులు చిందిస్తున్నారు. పంచెకట్టులో రామ్ చాలా కూల్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల గాగ్రా చోళీలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇద్దరూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతో కనిపిస్తున్నారు.

ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్‌ విడుదలయ్యాక క్రేజ్‌ మరింత పెరిగింది. రామ్ కెరీర్ లోనే ఖరీదైన సినిమా స్కంద. ఇప్పటికే రీ-రిలీజ్ బిజినెస్ లో రికార్డ్ సృష్టించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు