New Criminal Laws 2024: మన దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ కొత్త చట్టాలు తీసుకువచ్చారు. ఐపీసీ నిబంధనలలో పలు మార్పులు చేశారు. IPCలో ప్రతిపాదించబడిన ప్రధాన మార్పు ప్రకారం, కొత్త చట్టంలో IPC సెక్షన్ 377 తొలగించారు. ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ మీడియాలో ఈ సెక్షన్ తొలగింపుపై నీరసం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ది హిందూ పత్రిక ప్రకారం ఈ చట్టంలో పురుషులకు,ట్రాన్స్ జెండర్స్ కు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం పురుషులతో అసహజ సెక్స్ నేరంగా పరిగణించరు. ప్రతిపాదిత చట్టం లైంగిక నేరాన్ని స్త్రీ లేదా బిడ్డపై అత్యాచారం వంటి నేరంగా నిర్వచించింది.
పూర్తిగా చదవండి..New Criminal laws 2024: కొత్త చట్టాలతో సరికొత్త చిక్కు.. వారికి రక్షణ ఎక్కడ?
మన దేశంలో మూడు కొత్త చట్టాలు అమలు లోకి వచ్చాయి. అయితే, ఐపీసీ 377 సెక్షన్ స్థానంలో తెచ్చిన చట్టంలో పురుషులకు,ట్రాన్స్ జెండర్స్ కు రక్షణ లేకుండా పోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు. 377 సెక్షన్.. ఇప్పటి కొత్త సెక్షన్ వివాదం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: