New Constitution Copy: రాజ్యాంగం ప్రతుల్లో 'సోషలిస్ట్, సెక్యూలర్' పదాలు మిస్? వివరణ ఇచ్చిన మంత్రి..

కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదం చెలరేగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను అధికారికంగా కొత్త భవనంలోకి తరలించిన మరుసటి రోజు ప్రభుత్వం ఎంపీలకు రాజ్యాంగం ప్రతులను పంపిణీ చేసింది. అయితే, ఈ కాపీల్లో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేకపోవడం తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి.

New Constitution Copy: రాజ్యాంగం ప్రతుల్లో 'సోషలిస్ట్, సెక్యూలర్' పదాలు మిస్? వివరణ ఇచ్చిన మంత్రి..
New Update

India New Constitution Copy: కొత్త పార్లమెంట్ వేదికగా మరో వివాదం చెలరేగుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను అధికారికంగా కొత్త భవనంలోకి తరలించిన మరుసటి రోజు ప్రభుత్వం ఎంపీలకు రాజ్యాంగం ప్రతులను పంపిణీ చేసింది. అయితే, ఈ కాపీల్లో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు లేకపోవడం తీవ్ర వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇది రాజ్యాంగంపై దాడి అని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. అయితే, ఈ విమర్శలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్‌వాల్ స్పందించారు. ఈ కాపీలలో రాజ్యంగ ప్రవేశ అసలైన ప్రతులు ఉన్నాయని వివరించారు. రాజ్యంగం ఆవిర్భవించినప్పుడు అందులో సోషలిస్టు, సెక్యూలర్ అనే పదాలు లేవని, 1976లో రాజ్యాంగంలోని 42వ సవరణలో ఈ పదాలను చేర్చారని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు హిందీ భాషలోని రాజ్యాంగ పీఠకలో వివరాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అయితే, ఇంగ్లీష్ వెర్షన్, హిందీ వెర్షన్ మధ్య మార్పు అనుకోకుండా జరిగిందా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా, ఎంపీలకు అందించిన రాజ్యాంగం కొత్త కాపీ పీఠికలో ‘సోషలిస్ట్, సెక్యులర్’ అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి అధికార బీజేపీ ఉద్దేశ్యంలో ఏంటో అర్థమవుతోందన్నారు. '1976లో సవరణ చేసి ఈ పదాలను చేర్చారని మాకు తెలుసు, కానీ ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరైనా ఇస్తే అందులో ఆ పదాలు లేకుంటే ఆందోళన చెందాల్సిన విషయమే. వారి ఉద్దేశం అనుమానాస్పదంగా ఉంది. ఇది తెలివిగా జరిగింది. ఇది తీవ్రమైన అంశం. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం' అని అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభం రోజున ఎంపీలకు బహుమతిగా బ్యాగ్‌లో రాజ్యాంగ ప్రతులను పంపిణీ చేశారు. రాజ్యాంగ ప్రవేశిక మొదట భారతదేశాన్ని 'సార్వభౌత, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం'గా అభివర్ణించింది. అయితే, ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ సమయంలో 42వ సవరణ ద్వారా అనేక మార్పులు చేశారు. ఇందులో 'సార్వభౌమ, ప్రజాస్వామ్య పదాల మధ్య సోషలిస్ట్, లౌకిక పదాలను చేర్చారు. ఇది జాతి ఐక్యతకు, సమగ్రతకు నిదర్శనంగా పేర్కొనడం జరిగింది. అయితే, 1994లో సుప్రీంకోర్టు.. 'సెక్యులరిజం' అనేది ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంలో భాగమని, కొన్ని ప్రాథమిక లక్షణాలను తుడిచివేయలేమని స్పష్టం చేసింది.

కాగా, కొత్త రాజ్యాంగ పీఠలో ఆ రెండు పదాలు మిస్ అయ్యాయని, ఆ ప్రతుల ముద్రణ నిలిపివేయాలని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో ఏదైనా మార్పులు చేస్తే అది ట్యాంపరింగ్ అవుతుందని స్పష్టం చేశారు.

Also Read:

Markapuram: మానసను వెంటాడిన మృత్యువు..!! అసలు ఏం జరిగిందంటే..?

Big Breaking: విజయ దశమి తరువాత విశాఖ నుంచే పాలన..

#new-constitution-copy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe