Biomedical Course : 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది. తొలిసారిగా ప్రవేశపెట్టబోయే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Biomedical Course : 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.!
New Update

Biomedical Course  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా బీఎస్సీ బయోమెడికల్ కోర్సు ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు తెలిపింది.తొలిసారిగా ప్రవేశపెట్టబోతున్న ఈ కోర్సు బోధన ప్రణాళిక, తరగతుల నిర్వహణ, కార్పొరేట్ ఆసుపత్రుల భాగస్వామ్యంపై ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు. ముందుగా ప్రయోగాత్మకంగా స్వయంప్రతిపత్తి గత యూనివర్సిటీల పరిధిలో ఈకోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. 150 సీట్లతో తొలిఏడాది భర్తీ చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి , అవసరమైతే మార్పులచేర్పులతో వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ వైద్య రంగంలో బయో మెడికల్ సేవలకు మంచి డిమాండ్ ఉందని గుర్తించి ఈ కోర్సును ప్రవేశపెడుతున్నారు.

బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి?
బయోమెడికల్ ఇంజనీరింగ్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. ఇది ఆరోగ్య సంరక్షణ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఇంజనీరింగ్‌తో జీవశాస్త్రం భావనలు, సాంకేతికతలను మిళితం చేస్తుంది. మీ ప్రాధాన్యత కెరీర్ లక్ష్యాలను బట్టి, మీరు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ స్థాయిలలో బయోమెడికల్ ఇంజనీరింగ్‌ను అభ్యసించవచ్చు.

ఈ మల్టీడిసిప్లినరీ కోర్సు వైద్య అభ్యాసకులకు సహాయం చేయడమే కాకుండా రోగులకు అవసరమైన పునరావాసాన్ని అందించడానికి విద్యార్థులను అనుమతిస్తుంది. వ్యక్తి భారతదేశంలో గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతిలో PCM లేదా PCB చదివి ఉండాలి.మీరు పైన పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న తర్వాత, మీరు BTech, BE లేదా B.Sc కోసం సులభంగా నమోదు చేసుకోవచ్చు.

సిరాలజీ, బయాలజీ , ఫోరెన్సిక్ సైన్స్ , డీఎన్ఏ , ఫిజియోథెరపీ సహా వైద్య సంబంధమైన అనేక సబ్జెక్టులతో ప్రణాళిక రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ కోర్సును ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు కూడా అనుబంధ కోర్సుగా చేసే అవకాశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.

ఇది కూడా చదవండి :  ఇజ్రాయెల్ కు 6వేల మంది భారత కార్మికులు..ఎందుకీ తొందరపాటు నిర్ణయం?

#biomedical-course
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి