Bajaj Chetak EV Scooter: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్...ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!!

ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127కి.మీ ప్రయాణిస్తుంది.

New Update
Bajaj Chetak EV Scooter: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్...ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!!

Bajaj Chetak EV Scooter: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు తనదైన ముద్ర వేస్తున్నాయి. ప్రతిఏటా డిమాండ్ పెరుగుతుండటంతో సంప్రదాయ ఐసీఈ (ICE) ఇంజిన్ వాహనాలతో సమానంగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అర్భన్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ టూ ( EV Scooter)వీలర్లతోపాటు కార్లకు కూడా డిమాండ్ భారీగానే పెరుగుతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా సేల్ అవుతున్నాయి. కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

ఈక్రమంలో ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ (Bajaj )ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ (New Version Chetak Electric Scooter) ను లాంచ్ చేయనుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో కూడిన బ్లూ కలర్ స్కూటర్‌ ఫొటోలను రిలీజ్ చేసింది. కొత్త చేతక్ ర్యాంప్డ్ ఇంకా రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది. బజాజ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్, ట్రిప్, ఓడోమీటర్‌తో సెమీ సర్క్యులర్ డిస్‌ప్లే వంటి తదితర ఫీచర్లను వెల్లడించింది.

అర్బన్ మోడల్ గా భారత మార్కెట్లోకి:

అర్బన్ మోడల్ (Urban model)గా భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 127కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో లార్జర్ 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మార్కెట్లో ఉన్న బజాయ్ చేతక్ స్కూటర్ 2.88కిలోవాట్ల బ్యాటరీ, సింగిల్ ఛార్జింగ్ తో 113 కిలోమీటర్ల దూరం ప్రయాణించే కెపాసిటి ఉండేది. ఇప్పుడు ఈ కొత్త బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావడానికి 4.30 గంటల సమయం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 127కి.మీ ప్రయాణం: 

ప్రస్తుత మోడల్ బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ గంటకు 63కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తు..కొత్త చేతక్ బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 73కిలోమీటర్లు ప్రయాణిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఎల్సీడీ యూనిట్ స్థానే న్యూ టీఎఫ్టీ స్క్రీన్ ప్రవేశపెడుతున్నారు. టర్న్ బై టర్న్ నేవిషగేషన్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రిమోట్ లాక్, అన్ లాక్ , బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టోరేజీ కెపాసిటీ 18 లీటర్ల నుంచి 12 లీటర్లకు పెంచారు.

ఇది కూడా చదవండి:  యూపీలో సంచలన ఎన్ కౌంటర్…మాఫియా డాన్ హతం..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు