Inverter: ఇంట్లో ఈ ప్రదేశంలో ఇన్వర్టర్‌ని ఎప్పుడూ ఉంచకండి..! బ్యాటరీ త్వరగా పాడైపోతుంది..! ఇన్వర్టర్ ఇంట్లో నిత్యావసర వస్తువుగా మారుతోంది. అయితే ఇన్వర్టర్ ఎక్కువ కాలం పాటు పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో ఇన్వర్టర్ ను ఉంచే ప్రదేశం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వచ్ఛమైన గాలి, నీడ ఉన్న ప్రదేశంలో మాత్రమే దీనిని ఉంచాలి. By Archana 12 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Inverter: ఇన్వర్టర్ ఇంట్లో నిత్యావసర వస్తువుగా మారుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో కరెంటు కోతలు విపరీతంగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, ఇన్వర్టర్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు ఇన్వర్టర్ లేనప్పుడు గంటల తరబడి కరెంటు లేకుండా గడిపేవారు. ఇప్పుడు ఇన్వర్టర్ ఉండడంతో కరెంట్ పోయినా .. ఫ్యాన్, లైట్, ఫోన్ ఛార్జింగ్ అన్ని సులువుగా వాడుకోవచ్చు. అయితే ఇన్వర్టర్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో ఇన్వర్టర్ ను ఇంట్లో ఏ ప్రదేశంలో ఉంచుతున్నారు అనే దాని పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇన్వర్టర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్వర్టర్ సరిగ్గా పనిచేయడానికి, మీరు దాని బ్యాటరీపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా త్వరగా పాడైపోతుంది. చాలా మంది పెద్దగా పట్టించుకోని విషయం ఒకటి ఉంది. అది ఇంట్లో ఇన్వర్టర్ ను ఉంచే ప్రదేశం. ఇన్వర్టర్ సజావుగా పనిచేయడానికి, ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. ఇన్వర్టర్ ఇక్కడ ఉంచితే పాడైపోతుంది. ఇన్వర్టర్ ఉంచబడే ప్రదేశం ఆధారంగా దాని జీవితకాలాన్ని నిర్ణయించవచ్చు. ఇన్వర్టర్, బ్యాటరీ స్వచ్ఛమైన గాలికి గురయ్యే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. దానికి గాలి ప్రసరణకు తగినంత స్థలం ఉండటం చాలా ముఖ్యం. బ్యాటరీ చుట్టూ ఉప్పునీరు, విపరీతమైన వేడి ఉన్న ప్రదేశాల్లో అస్సలు ఉంచకూడదు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇన్వర్టర్ ఎల్లప్పుడూ నీడ ఉన్న ప్రదేశంలో ఉండాలి. నేరుగా సూర్యకాంతి పడితే దాని లైఫ్ స్పాన్ క్రమంగా తగ్గిపోతుంది. ఇది కాకుండా, వోల్టేజ్ డ్రాప్‌ను తగ్గించడానికి, ఇన్‌వర్టర్‌ను మీటర్‌కు దగ్గరగా ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించాలి. Also Read: Parenting Guide: నవజాత శిశువులలో ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి?.. నిపుణులు ఏం చెబుతున్నారు..? #inverter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి