AP: కుంగిన కల్వర్టు.. 8 గ్రామాలకు రాకపోకలు బంద్..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

New Update
AP: కుంగిన కల్వర్టు.. 8 గ్రామాలకు రాకపోకలు బంద్..!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం వేములపాలెం, విందూరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు కుంగిపోయింది. దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు కూలిపోవడంతో ఎగువ గ్రామాలైన సుమారు 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Also Read: టీడీపీ – జనసేనలో మొదలైన ముసలం.. పెత్తనం కోసం ముదురుతున్న వైరం..!

విషయం తెలుసుకున్న ఆర్&బి అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యాన్మయం రోడ్డు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఏఈ మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఈ మార్గం గుండా అధిక బరువు లోడులతో వాహనాలు వెళ్లడం వల్ల కల్వర్టు కూలిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు