Navya Nanda: అమితాబచ్చన్ మనవరాలు చేసిన పనికి ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌ ..అసలేం జరిగిందంటే..?

అమితాబచ్చన్, జయా బచ్చన్ ముద్దుల మనవరాలు, శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అయితే, ప్యారిస్ ఫ్యాషన్ షోలో తనకు తొలిసారి ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడంతో నవ్య భయం భయంగా ర్యాంప్ వాక్ చేసింది. దీంతో అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తనకు గట్టి ఫీడ్ బ్యాక్ వస్తోంది. కొంత కష్టపడి అయినా ర్యాంప్ వాక్ నేర్చుకోవాలంటూ ఫ్యాన్స్ పలు సూచనలు ఇస్తున్నారు. మరి కొందరు ..అమితాబచ్చన్ మనవరాలై ఉండి ఇలా భయం భయంగా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Navya Nanda: అమితాబచ్చన్ మనవరాలు చేసిన పనికి ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌ ..అసలేం జరిగిందంటే..?

Navya Nanda : అమితాబచ్చన్, జయా బచ్చన్ ముద్దుల మనవరాలు, శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అయితే, లోరియల్ బ్రాండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ్య నవేలి నందాకు ఫస్ట్ టైం ర్యాంప్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్యారిస్ ఫ్యాషన్ షోలో తనకు తొలిసారి ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడంతో నవ్య భయం భయంగా ర్యాంప్ వాక్ చేసింది. ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడం పట్ల నవేలి నందా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

publive-image

‘‘మహిళల కోసం, మహిళల సాధికారత కోసం ఓ రాత్రి అంకితం చేశాను. ఈ ప్రత్యేకమైన షోలో భాగమయ్యేందుకు అవకాశం కల్పించిన లోరియల్ ప్యారిస్ కు ధన్యవాదాలు. మహిళలకు సురక్షితమైన, పర్యావరణ వ్యవస్థల ఏర్పాటు దిశగా పనిచేసేందుకు అవకాశం రావడం పట్ల గర్వపడుతున్నాను. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అంటూ పెద్ద పోస్ట్ పెట్టింది.

నవేలి నందా పోస్ట్ కు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘అక్కడ అందరి దృష్టి ఆకర్షించలేకపోయినందున, వచ్చే సారి కోసం ర్యాంప్ వాక్ నేర్చుకునేందుకు కొంత కష్టపడు. ధైర్యంగా ఈ అడుగు వేసినందుకు అభినందించాల్సిందే. మరింత శిక్షణ అయితే అవసరం’’ అని ఓ అభిమాని సూచించగా.. దానికి ఓకే అంటూ నవేలి నందా చేతులు జోడించి నమస్కరించే ఎమోజీ పోస్ట్ చేసింది. నిన్ను చూసి గర్వపడుతున్నానని, భయం లేకుండా నడవాలంటూ తల్లి శ్వేతా బచ్చన్ సూచించారు. దీనికి నవ్యనవేలి లవ్ యూ మామ్ అంటూ రిప్లయ్ ఇచ్చింది.

Also Read: మగాడివేనా నువ్వు? రెచ్చిపోయిన కుష్బూ..!!

Advertisment
తాజా కథనాలు