Navaratrulu: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

New Update
Navaratrulu: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

మరి కొద్ది రోజుల్లో నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ నవరాత్రులు అక్టోబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 24 వరకు జరగనున్నాయి. నవరాత్రలు సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. పూజలు, ఉపవాసాలతో నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అమ్మవారిని 9 రోజుల పాటు నియమ నిష్టలతో వివిధ రకాలుగా పూజలు చేసి ఉపవాసం చేస్తారు. ఇలా చేస్తే అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక బాధలు ఉన్న, డబ్బు కొరత వంటి అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఇవన్నీ ఒక విధానం అయితే.. కోరుకున్న వాడిని వివాహం చేసుకోవడానికి కూడా నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఆచరిస్తే నచ్చిన వానితో పెళ్లి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.

Also Read: ఈ సారి వెల్లుల్లి వంతు వచ్చింది..రోజురోజుకి!

నవరాత్రుల్లో తృతీయ, పంచమి, సప్తమి, నవమి రోజుల్లో శివాలయానికి వెళ్లి శివపార్వతులకు నీరు, పాలు సమర్పించి పంచోపచారాలతో పూజించాలి. అలాగే శివపార్వతులకు కళ్యాణం జరిపించాలి. ఆ తరువాత గుడిలో కూర్చుని ఎర్ర చందనం జపమాలతో స్వామివారి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే కోరుకున్న వరుడు లభిస్తాడు.

అలాగే వివాహ బంధంలో ఇబ్బందులు తలెత్తిన..విభేదాలు ఉన్నా నవరాత్రుల సమయంలో పూజల వల్ల భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ క్రమంలోనే అమ్మవారి స్తోత్రాన్ని 108 సార్లు జపం చేసి అగ్నిలో నెయ్యి వేయ్యాలి. మొత్తం 9 రోజులు పూజ సమయంలో ఉదయాన్నే నిద్ర లేవాలి. అమ్మవారి చౌపాయ్ ని 21 సార్లు చదవాలి. ఇలా చేస్తే భార్యభర్తల మధ్య విభేదాలు, వివాదాలు సమసిపోతాయి.

Also Read: విశాఖ వాసులకు గుడ్ న్యూస్!

వివాహం కానీ ఆలస్యం అవుతుంటే..నవరాత్రుల సమయంలో పూజా స్థలంలో శివ పార్వతుల చిత్ర పటాన్ని ఉంచి తరువాత పూజించి శివ మంత్రాన్ని 3,5,10 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. దాంతో పాటు తమలపాకు పై సింధూరంతో కలిపి, దుర్గాదేవికి పసుపు వస్త్రంలో కలిపి సమర్పిస్తే అవివాహితులకు త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి.

నవరాత్రుల సమయంలో 9 రోజులు తమలపాకులపై కుంకుమతో పూజించడం వల్ల ఇంట్లో తలెత్తే విభేధాలు సమసిపోతాయి. నవరాత్రుల సమయంలో దుర్గాదేవి స్త్రోత్రాన్ని పఠించడంతో పాటు ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కని నాటి పూజించాలి.దీని వల్ల ఇంట్లో ఆనందాలు పెరుగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నవరాత్రుల సమయంలో ఒక ఐదు రోజుల పాటు ఉదయాన్నే పసుపు వస్త్రం వేసుకుని ఆసనం పై ఉత్తరం వైపు కూర్చొని ముందు 9 ఆవాల నూనె దీపాలను వెలిగించండి. ఆ దీపాల ముందు రంగుల బియ్యాన్ని పీఠంగా చేసి దాని పై శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించాలి. తరువాత ఒక పళ్లెంలో స్వస్తిక్‌ వేసి పూజించాలి. ఈ పరిహారంతో, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు.

Also read: బీటెక్ అభ్యర్థులకు 5089 ఉద్యోగాలకు అర్హత.. తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు