Sitaram Yechury: సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

New Update
Sitaram Yechury

Sitaram Yechury: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కాగా ఆరోజు నుంచి ఆయనకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందారు. దీంతో కమ్మూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

ఏచూరి గురించి క్లుప్తంగా..

* 1952 ఆగస్టు 12న మద్రాసులో జననం
* ఢిల్లీలోనే విద్యాభ్యాసం
* ఢిల్లీ ఎస్టేట్ స్కూల్‌లో పాఠశాల విద్య
* సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు
* సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బీఏ ఆర్థికశాస్త్రం
* జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీలో ఎంఏ ఆర్థికశాస్త్రం
* డిగ్రీ, పీజీలోనూ మొదటి ర్యాంకులో పాస్‌
* 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్
* 1974లో SFIలో చేరిన ఏచూరి
* 1978లో అఖిల భారత SFI సంయుక్త కార్యదర్శిగా సేవలు
* ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నిక
* 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో..
* 1988లో కేంద్ర కార్యవర్గంలో..
* 1999లో పొలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు
* 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నిక

Advertisment
తాజా కథనాలు