/rtv/media/media_files/2025/02/01/NPZ7mlSJsS0SpquBl9A0.jpg)
MSME Photograph: (MSME )
డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతున్నట్లు పార్లమెంట్‌లో ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. తన బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లును పెంచుతామని ప్రకటించారు. దీంతో డాక్టర్లు కావాలనుకునే యువత సులువుగా మెడిసిన్ చేసే అవకాశం లభిస్తుంది.
దేశంలోని వైద్య కళాశాలల్లో ఇప్పుడు మొత్తం 1,12,112 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, వీటి కోసం ప్రతి సంవత్సరం అడ్మిషన్ కోసం పోరాటం జరుగుతుంది. ఈ సీట్లకు నీట్ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. 2014 సంవత్సరం వరకు మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 51348 ఉండగా, 2014 వరకు దేశంలో మొత్తం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జూలై 2024 వరకు ఉన్న డేటా ప్రకారం, ఇప్పుడు దేశంలోని వైద్య కళాశాలల సంఖ్య 731. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కూడా పెంచారు. 2014 వరకు మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య 31185 కాగా, జూలై 2024 నాటికి ఈ సీట్ల సంఖ్య 72 వేల 627కి పెరిగింది.