Ratan Tata: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక రతన్ టాటా మరణం దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్ని కలచివేస్తోంది. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీని స్థాపించారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు, జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు అందించారు.
జంతు ప్రేమికుడు
జంతువులను కూడా మనుషుల కంటే ఎక్కువగా చూసుకునే అరుదైన వ్యక్తి టాటా. రతన్ టాటాకు జంతువులు అంటే అమితమైన ప్రేమ. రోడ్డు మీద కుక్కలు ఏదైనా ప్రమాదం బారిన పడడం చూసినా, అవయవాలు సరిగ్గా లేకుండా కనిపించినా ఆయన ప్రాణం అల్లాడిపోతుంది. ఇలా మూగజంతువుల సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు టాటా.
పెంపుడు కుక్క కోసం అవార్డునే వద్దనుకున్న టాటా
రతన్ టాటాకు జంతువుల పట్ల ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఈ సంఘటన వింటే మీకే అర్థమవుతుంది. అయితే రతన్ టాటాకు 2018లో బ్రిటన్ రాజు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకునేందు టాటాను బంకింగ్ హమ్ ప్యాలెస్‌కు రావాలని ఆహ్వానించారు. కానీ టాటా ఈ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ రోజు తన పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. దాన్ని వదిలి వెళ్లలేక అవార్డునే కాదనుకున్నారు టాటా.
రూ.165 కోట్లతో డాగ్ హాస్పిటల్
రతన్ టాటా కుక్కల సంరక్షణ కోసం రూ.165 కోట్లతో 'స్మాల్ యానిమల్' పేరుతో ముంబైలో డాగ్ హాస్పిటల్ నిర్మించారు. ఈ హాస్పిటల్‌లో ఏకకాలంలో 200 పెంపుడు జంతువులకు చికిత్స అందించవచ్చు. బ్రిటీష్ వైద్యుడు థామస్ హీత్‌కోట్ నేతృత్వంలో నిపుణులైన వైద్యుల బృందం ఈ ఆస్పత్రి కోసం పనిచేస్తోంది. ఈ ఆస్పత్రి ద్వారా రతన్ టాటా అనాథలైన ఎన్నో జంతువులకు వైద్యం అందించారు. టాటా ఈ జంతు వైద్యశాల బాధ్యతలను టాటా ట్రస్టులకు అప్పగించారు. ఈ ఆసుపత్రి అయన కలల ప్రాజెక్ట్‌లో ఒకటి.
Also Read: ఈ ఒక్క వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. టాటా జీవితం మొత్తాన్ని ఇక్కడ చూసేయండి!