/rtv/media/media_files/2024/12/26/sXak9ZTjZJgMKipQYwjb.jpg)
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య రెండు సార్లు కాంగ్రెస్ నేతృత్వంలో UPA ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే మాజీ ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో 1991 నుంచి 1996 మధ్య ఐదు సంవత్సరాలు దేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
/rtv/media/media_files/2024/12/27/PrjTotBLacsziLb9obQ2.jpg)
మన్మోహన్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదు. అయితే 1991లో ఆయన కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
/rtv/media/media_files/2024/12/27/kSBO8yQUu0dXlgr4s7Lt.jpg)
రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ఐదు సార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో రాజస్థాన్‌కు మారారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన పదవీకాలం ముగిసింది.
/rtv/media/media_files/2024/12/27/CloTxRNoNy6VgjPRdaEa.jpg)
మన్మోహన్ సింగ్ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. విద్య, ఇలక్ట్రిసిటీ, తాగు నీరు వంటి మౌలిక సౌకర్యాలు లేని ఒక చిన్న గ్రామంలో నివసించారు. కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకునేవారు.
/rtv/media/media_files/2024/12/26/HDGKpumxv9O84i8EVB1w.jpg)
గాహ్ పాకిస్థాన్ ప్రావిన్స్ పంజాబ్ లో జన్మించిన ఆయన 1947లో భారత విభజన సమయంలో, మన్మోహన్ సింగ్ కుటుంబం అమృత్‌సర్‌కు వలస వెళ్లి కొత్తగా జీవితం మొదలుపెట్టింది.
/rtv/media/media_files/2024/12/27/pfuCYPFUHG63GIZdIVp4.jpg)
2004లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎంపికైన మొదటి హిందువేతర వ్యక్తి మన్మోహన్ సింగ్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Manmohan-Singh-1-jpg.webp)
మన్మోహన్ సింగ్ కి ప్రతిరోజు తిరోజూ ఉదయం BBC న్యూస్ అనుసరించడం అలవాటు.
/rtv/media/media_files/2024/12/27/kSBO8yQUu0dXlgr4s7Lt.jpg)
1993లో యూరోమనీ, ఆసియామనీ సంస్థలు సింగ్‌ను "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపిక చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chalasani-Narendra-jpg.webp)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్లుగా పనిచేసి.. ఆర్ధిక మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. మరొకరు CD దేశ్‌ముఖ్.
/rtv/media/media_files/2024/12/27/pfuCYPFUHG63GIZdIVp4.jpg)
అంతేకాదు ఇప్పటివరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నలుగురు ఆర్థిక మంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. మన్మోహన్ సింగ్ తో పాటు ఆర్ధిక మంత్రులుగా పనిచేసిన మోరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వై.పీ. సింగ్ ప్రధానులుగా ఎంపికయ్యారు.
/rtv/media/media_files/2024/12/27/kSBO8yQUu0dXlgr4s7Lt.jpg)
మన్మోహన్ సింగ్ హిందీ అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ.. భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఎక్కువగా ఉర్దూలోనే ఉంటాయి.