Femina Miss India 2024: 60వ ఫెమినా మిస్ ఇండియా 2024 పోటీలు అక్టోబర్ 16న ముంబైలో వేదికగా జరిగాయి. ఈ పోటీల్లో 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. ఇందులో మధ్యప్రదేశ్ కు చెందిన 18 ఏళ్ల నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా 2024 కిరీటాన్ని కైవసం చేసుకుంది. గత సంవత్సరం టైటిల్ విజేత నందిని గుప్తా ఆమెకు మిస్ ఇండియా కిరీటాన్ని అందించారు. మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న నిఖిత నెక్స్ట్ జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రేఖా పాండే, ఆయుశీ దోలకియా ఫస్ట్, సెకండ్ రన్నరప్ లుగా నిలిచారు.
నికితా పోర్వాల్ ఎర్లీ లైఫ్
నికితా పోర్వాల్ పురాణాలు, సాంస్కృతిక వారసత్వంతో కూడిన ఉజ్జయిని జన్మించింది. ఆలోచనలను గుడ్డిగా అంగీకరించకుండా విమర్శనాత్మకంగా ఆలోచించాలి అనే వాతావరణంలో పెరిగిన నిఖిత.. చిన్నప్పటి నుంచే జీవితం పట్ల చాలా ఉత్సుకతను పెంచుకుంది.
నిఖిత కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం బరోడాలోని మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది.
థియేటర్, ఫిల్మ్‌లో కెరీర్
చదువుతో పాటు కళల పట్ల ఆమెకున్న అభిరుచి ఆమెను థియేటర్ ఆర్ట్స్, ఫిల్మ్ కెరీర్ వైపు కూడా అడుగులు వేసేలా చేసింది. నిఖిత 60కి పైగా నాటకాలలో తన ప్రదర్శనను ఇచ్చింది. అంతేకాదు "కృష్ణ లీల" పేరుతో 250 పేజీల నాటకాన్ని స్వయంగా రాసి రచయితగా కూడా తన ప్రతిభను చాటుకుంది. నటన అంటే విపరీతమైన ప్రేమ ఉన్న సినిమాల్లో కూడా తన నైపుణ్యాలను ప్రదర్శించాలనుకుంది. తాను మొదటగా నటించిన 'చంబల్ పార్' చిత్రం అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో గుర్తింపు పొందింది.
Femina Miss India 2024
Also Read: బిగ్‌బాస్‌లో మత రచ్చ! మెహబూబ్, నబీల్ ఇద్దరికీ రెడ్ కార్డు.. నెటిజన్ల ట్రోల్స్