CBSE Board Exam: CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 2025 అకాడమిక్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1 నుంచి మొదలవగా.. థియరీ పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు cbse.gov.inలో బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చు. దీనికి ముందు CBSE వింటర్-బౌండ్ స్కూల్స్ ప్రాక్టికల్ పరీక్షల తేదీలను బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలు 2024 నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 2024 మధ్య నిర్వహించనున్నారు.
Also Read: మెనోపాజ్ టైంలో మహిళలు ఒత్తిడి, ఆందోళనకు ఎందుకు గురవుతారు?
CBSE బోర్డు 2025 10th, 12th పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలని బోర్డు నోటీసులో తెలిపింది. బోర్డు నిబంధనల ప్రకారం, మెడికల్ ఎమర్జెన్సీ, జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లలో పాల్గొనడం మరేదైనా ముఖ్యమైన కారణాల వల్ల మాత్రమే విద్యార్థులకు 25 శాతం హాజరు కన్సిడర్ చేయబడుతుంది.
Also Read: భారత్‌లోకి స్టార్‌లింక్.. అంబానీకి చెక్ పెట్టనున్న ఎలాన్ మస్క్ !