ISRO: దటీజ్‌ ఇండియా.. నాసాపై ఇస్రో చీఫ్ కామెంట్స్ వైరల్..!

అమెరికా అంతరీక్ష సంస్థ నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత నాసా మన టెక్నాలజీని అడిగినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండియా బెస్ట్ ఎక్విప్మెంట్స్‌ని, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని.. అందుకు ప్రధాని మోదీనే కారణమన్నారు.

ISRO: దటీజ్‌ ఇండియా.. నాసాపై ఇస్రో చీఫ్ కామెంట్స్ వైరల్..!
New Update

చంద్రయాన్-3(Chandrayaan-3) సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరు మారుమోగిపోయింది. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా.. అతి తక్కువ ఖర్చుతో చంద్రుడి సౌత్ పోల్ పై కాలు మోపి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే, చంద్రయాన్-3 సక్సెస్ తో ఇండియన్ టెక్నాలజీ మరో రేంజ్ కి వెళ్లిపోయింది. దీంతో, ఈ టెక్నాలజీని దక్కించుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై ఇస్రో చీఫ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత.. నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్‌నాథ్ అన్నారు.

మోదీనే కారణం:
చంద్రయాన్ 3 లాంచింగ్ కు ముందు వాటి పని తీరును చూసేందుకు నాసా నుంచి ఆరుగురు నిపుణులు వచ్చారని..వారికి మేము చంద్రయాన్-3 ని ఎలా తయారు చేసామో..చంద్రుడిపై ఎలా దిగబోతున్నాము అనేది వివరించామని చెప్పారు. ఈ టెక్నాలజీ విన్న నాసా.. ఈ టెక్నాలజీని తమతో పంచుకోమని అడిగారని ఇస్రో చీఫ్ వ్యాఖ్యానించారు. మన ఇండియన్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో ఉండడమే కాకుండా.. ఈ టెక్నాలజీని తయారు చేయడం కూడా ఈజీగా ఉండడంతో.. నాసా తమకు ఇవ్వాలని అడుగుతుందన్నారు. మరోవైపు కాలం మారిపోయిందని.. ప్రస్తుతం ఇండియా బెస్ట్ ఎక్విప్మెంట్స్‌ని, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని.. అందుకు ప్రధాని మోదీనే కారణమని చెప్పారు. చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్ లోని స్కైరూట్ రాకెట్లను తయారు చేస్తోందని.. ఇండియాలోని 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నాయని సోమనాథ్ అన్నారు.

చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..?
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రామేశ్వరంలోని డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ లోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాత్రిపూట కాకుండా మెలుకువగా ఉన్నప్పుడు కలలు కనాలని అబ్దుల్ కలాం చెప్పారని అన్నారు. ఎవరికైనా కలలు ఉన్నాయా..? ఎవరైనా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..? అని పిల్లల్ని అడిగారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ టైంలో ప్రధాని మోదీ ఇండియన్స్ ని చంద్రుడిపైకి ఎప్పుడు పంపుతారని అడిగారని.. చంద్రయాన్ -10వ సమయంలో మీలో ఒకరు రాకెట్ లో ఇండియా నుంచి చంద్రుడిపైకి వెళ్తారని, అది ఒక మహిళ కూడా కావచ్చని స్టూడెంట్స్ తో అన్నారు.

ALSO READ: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా?

#chandrayaan-3
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe