Nara Lokesh: ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించింది. త్వరలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ ప్రస్తవన హాట్ టాపిక్ గా మారింది.
Also Read: రక్షణ కల్పించండి.. మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన ట్వీట్..!
రెడ్ బుక్ అంటే టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించిన వైసీపీ నేతల పేర్లు, అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లను తన రెడ్ బుక్ లో నమోదు చేసుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు నారా లోకేష్. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో RTV బయటపెట్టిన లోకేష్ రెడ్ బుక్ వివరాలను తెలుసుకుందాం..
Also Read: జగన్ జైలుకే.. ఆయనకు రంకుమొగుడు ఇతడే.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్..!
సిరీస్‌ల వారిగా ఒక్కొక్కరి పేరు బయటపెట్టబోతుంది RTV. సిరీస్-1లో ఐదుగురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి పేజీలో సిట్ చీఫ్ కొల్లి రఘురాంరెడ్డి పేరు, రెండో పేజీలో సీఐడీ చీఫ్ సంజయ్ పేరు, మూడో పేజీలో AAG పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేరు, నాలుగో పేజీలో కొడాలి నాని పేరు, ఐదో పేజీలో వల్లభనేని వంశీ పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. సిరీస్-2 లో మరికొందరు వైసీపీ నేతలు, అధికారుల పేర్లు వెల్లడించనుంది RTV.