/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lokesh-1-jpg.webp)
Nara Lokesh: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మహిళా వాలంటీర్ పై వైసీపీ నేతల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. అగలి మండలం కదిరేపల్లి లో వైసీపీ ఎంపీటీసీ బసవరాజు తనను తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడంటూ మహిళా వాలంటీర్ వేద వాపోతోంది. వైసీపీ ఎంపీటీసీ బసవరాజు నుండి తనకు ప్రాణా హాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చెందుతోంది. ఈ ఘర్షణలో తన తమ్ముడికి బాగా గాయాలు అయ్యాయని బాధితురాలు వెల్లడించింది. తాజాగా, ఈ ఘటనపై నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు.
వైసీపీ నేతల దాష్టీకాలకు వారి పార్టీ కార్యకర్తలైన వలంటీర్లు కూడా బలవుతున్నారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ వలంటీర్ వేద పై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణం. స్థానిక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. బాధిత వలంటీర్… pic.twitter.com/WWYdzRsZKS
— Lokesh Nara (@naralokesh) November 7, 2023
వైసీపీ నేతల దాష్టీకాలకు వారి పార్టీ కార్యకర్తలైన వాలంటీర్లు కూడా బలవుతున్నారని మండిపడ్డారు. మడకశిర నియోజకవర్గం రావూరు పంచాయతీ వాలంటీర్ వేద పై వైసీపీ ఎంపీటీసీ హత్యాయత్నంతో పాటు అత్యాచారాయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నారని బాధితురాలు చెబుతోందని తెలిపారు. బాధిత వాలంటీర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటే..ఇంకా సామాన్య మహిళలకు జగన్ పాలనలో రక్షణ ఎక్కడా ఉంటుందని ప్రశ్నించారు. వెంటనే వైసీపీ ఎంపీటీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.