ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు.!

అమలాపురంలో యువతతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "నాది కాలేజ్ లైఫ్.. జగన్ ది జైల్ లైఫ్. టీడీపీ హయంలో జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న ఏపీని..జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు" అని వ్యంగ్యంగా మాట్లాడారు.

Lokesh: యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
New Update

Nara Lokesh: అమలాపురం నియోజకవర్గం బట్నవిల్లిలో యువతతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జగన్ పై చురకలు అంటిస్తునూ తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  "నాది కాలేజ్ లైఫ్.. జగన్ ది జైల్ లైఫ్. చంద్రబాబు గారి హయాంలో ఏపి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉండేది. జగన్ ఏపి ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చేశాడు. చంద్రబాబు గారి హయాంలో కియా, ఫాక్స్ కాన్ లాంటి కంపెనీలు వచ్చాయి. జగన్ హయాంలో బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ వచ్చాయి. యువత పవర్ ఏంటో మొదటి సారి ఓటర్లు గా మీరు జగన్ కి చూపించాలి.

బాలయోగి గారు అమలాపురం రైల్వే లైన్ కోసం ఎంతో కృషి చేశారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2014 లో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రాన్ని ఒప్పించి చంద్రబాబు గారు పనులు ప్రారంభించేలా చేసారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేశారు. 25 కి 25 పార్లమెంట్ సీట్లు టిడిపి కి ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల లో అమలాపురం రైల్వే లైన్ తో పాటు మెరుగైన రోడ్లు వేస్తాం.

Also Read: నవంబర్ 30న సెలవు ఇవాల్సిందే..ఈసీ హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎవరైనా అడిగితే చెప్పే పరిస్థితి లేకుండా చేసాడు జగన్. చంద్రబాబు అమరావతిని రాజధాని గా ప్రకటించి ఇతర జిల్లాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు. టిడిపి హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అని వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం అడ్వకేట్లను కూడా ఇబ్బంది పెడుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూవివాదాల పరిష్కారం కోర్టులో కాకుండా రాజకీయ నాయకులు ప్రమేయంతో జరిగే వ్యవస్థ తీసుకురావాలని అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల పై పెత్తనం చెయ్యాలని జగన్ ఆలోచిస్తున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తెచ్చిన కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.

publive-image

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. విద్యా దీవెన, వసతి దీవెన అంటూ కొత్త పథకాలు తెచ్చి వ్యవస్థ ను జగన్ నాశనం చేసాడు. దీని వలన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.  టిడిప , జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభిస్తాం. యువత రాజకీయాల్లోకి రావాలి.. మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మార్పు రావాలి అనుకోవడం కాదు.. మార్పు కోసం మీరు ముందుకు రావాలి..టిడిపి - జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

Also Read: ఒక వ్యక్తి పేరు విని అవాక్కయిన మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్.!

జగన్ లా జాబ్ లెస్ క్యాలెండర్ కాదు.. ప్రతి ఏడాది ఒక పద్దతి ప్రకారం పెండింగ్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. జగన్ పాలన ముగిసే సరికి ఏపి అప్పు 12 లక్షల కోట్ల కు చేరుతుంది. జగన్ గ్రోత్ ఇంజిన్ ని ఆపేసాడు. జగన్ వలన రాష్ట్రం పరువు పోయింది. అమర్ రాజా లాంటి అనేక కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశాడు. విశాఖ మిలీనియం టవర్స్ కి నేను తెచ్చిన ఐటి కంపెనీలకు తరిమేసి సచివాలయం చేస్తానని జగన్ అంటున్నాడు. రాష్ట్రంపై పోయిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. రాష్ట్రం పరువు నిలబెట్టడం ఒక్క చంద్రబాబు గారితోనే సాధ్యం.నా తల్లి, భార్య పై కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం అని మంత్రులు మాట్లాడారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ సిలబస్ ప్రక్షాళన చేస్తాం. విద్యార్థి స్థాయి నుండే మహిళల విలువ తెలిపి గౌరవించే విధంగా ప్రత్యేక పాఠాలు ప్రవేశ పెడతాం. మహిళల్ని ఇబ్బంది పెట్టే వారిని శిక్షిస్తాం. జగన్ భర్తీ చేస్తానని అన్న 2.30 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నూతన విద్యా విధానం పేరుతో టీచర్ పోస్టులకు కోత పెడుతున్నాడు జగన్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ లేదు. జగన్ వలన ఏపి లో ప్రతి వీధిలో గంజాయి దొరుకుతుంది. స్కూల్ దగ్గర నుండి మెడికల్ కాలేజ్ వరకూ అందరినీ గంజాయి కి బానిసలుగా చేస్తుంది. ఆక్వా కి, వరి, ఇతర రైతులకు గిట్టుబాటు ధర లేదు.. ఏపి లో కేవలం గంజాయి కి మాత్రమే గిట్టుబాటు ధర ఉంది. టిడిపి - జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి లేకుండా చేస్తాం.

Also Read: 8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు

ఫిజియథెరపీ విలువ నాకు పాదయాత్ర ప్రారంభించిన తరువాత తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియథెరపీ పోస్టులు కల్పించేలా అధికారంలోకి వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థ ను నాశనం చేసింది. టిడిపి - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన మేర ప్రభుత్వ కాలేజీలు ప్రారంభిస్తాం.

ఏపీలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు... రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. టిడిపి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 3 వేల కోట్లు ఖర్చు చేశాం. అభివృద్ధి, సంక్షేమం టిడిపి కి జోడేద్దుల బండి. టిడిపి - జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం". ఇలా యువతకు తన ప్రసంగంతో అవగాహన కల్పించారు.

#andhra-paradesh #nara-lokesh-yuvagalam-padayatra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe