Lokesh Birthday : కృష్ణ నదిలో లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్.. వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపిన అభిమాని తాడికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పులి చిన్న లోకేష్ కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపారు. విజయవాడ నడిబొడున కృష్ణ నదిలోకి వెళ్లి లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అభిమానం చాటుకున్నారు. By Jyoshna Sappogula 23 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Nara Lokesh Birthday Celebrations: నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన 41 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున లోకేష్ పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని లోకేష్ కు వినూత్నంగా బర్త్ డే విషెస్ తెలిపారు. కనీ, విని ఎరుగని రీతిలో వినూత్నంగా తన అభిమానం చాటుకున్నారు. Also Read: మళ్లీ రాజన్న రాజ్యమే.. ఆర్టీవీతో షర్మిల ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ! తాడికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు పులి చిన్న.. విజయవాడ నడిబొడున కృష్ణ నదిలోకి వెళ్లి లోకేష్ 100 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. నారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన అభిమానాన్ని చూసి అందరూ ఆశ్చర్య పోయారు. ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు, ఆ అల్లా రక్ష, యేసు ప్రభు దీవెనలతో నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. #nara-lokesh-birthday-celebrations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి