Byreddy Shabari Interview : పదవుల కోసం పాకులాడే ఫ్యామిలీ మాది కాదన్నారు నంద్యాల(Nandyal) టీడీపీ(TDP) ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి(Byreddy Shabari). రాయలసీమ(Rayalaseema) అభివృద్ధి కోసమే బైరెడ్డి కుటుంబం పోరాటం చేసిందన్నారు. బైరెడ్డి కుటుంబానికి అసలు రాజకీయ వారసురాలిని నేనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శబరి. సోషల్ మీడియా(Social Media) లో రెండు పోస్టులు, యూట్యూబ్(YouTube) లో రెండు డైలాగులు కొట్టినంత మాత్రానా బైరెడ్డికి వారసులు కాలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ కోనసీమను తలపించే నంద్యాల పార్లమెంట్లో కనీసం తాగేందుకు నీళ్లు లేవన్నారు. ఐదేళ్లుగా ఎంపీగా ఉన్న పోచ బ్రహ్మనందరెడ్డి.. ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. సీడ్ హబ్ గా మారుస్తానంటూ నకిలీ విత్తనాలకు హబ్ గా మార్చాడంటూ ఎద్దేవా చేశారు. మంత్రి బుగ్గర రిబ్బన్ కట్టింగ్ లు, శంకుస్థాపన తప్ప డెవలప్ మెంట్ చేసింది శూన్యం అన్నారు. ఈ సారి ఎన్నికల్లో నంద్యాల టీడీపీ ఎంపీగా గెలవడం ఖాయమంటున్న శబరితో ఆర్టీవీ ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ చూడండి.
ఇది కూడా చదవండి : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష్య సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.!