Komatiredy Vs Kancharla: నల్గొండ జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు భువనగిరి ఎంపీ, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP Komatireddy Venkatreddy) అటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Nalgonda BRS MLA Kancharla Bhupalreddy) వర్గాలు బల ప్రదర్శనకు రెడీ అయ్యారు. ఈ రెండు వర్గాలు ఒకేసారి గణేశుడి నిమజ్జనానికి సిద్దమైయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది సిబ్బందితో పటిష్ట భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు,16 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు నల్లగొండ పట్టణంలో భారీగా మోహరించారు. ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా వెంటనే అదుపులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు.
ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఇరువురు నేతలు గణేశ్ నిమజ్జనాన్ని అవకాశంగా తీసుకుని పోటాపోటీగా జనసమీకరణ చేసి తమ బలాన్ని చాటుతున్నారు. నేడు కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి పాతబస్తీ వరకు ర్యాలీ చేయనుండగా.. అందుకు దీటుగా నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాడర్ కూడా ర్యాలీ నిర్వహించనున్నారు. కాగా, శోభాయాత్రలో అన్ని పార్టీల నేతలు పాల్గొననుండతో హై టెన్షన్ వాతవారణం నెలకొంది.
గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. ‘‘నల్గొండలో పోటీ చేయి.. నిన్ను ఒడించేందుకు సిద్ధంగా ఉన్న. నల్గొండ అభివృద్ధి కోసం రాజీనామా చేసి, ప్రాణత్యాగానికి సిద్ధం.. నల్గొండ నడిబొడ్డులో బహిరంగ చర్చకు రా. మర్రిగూడ బైపాస్‌లో వేయాల్సిన ప్లై ఓవర్‌ను చర్లపల్లిలో వేసి 32 మందిని, దుప్పలపల్లి ప్లై ఓవర్ వేసి 11మంది ప్రాణాలు బలిగొన్నావు. తమ్ముడి కోసం మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని ఓడించింది నువ్వు కాదా.’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నల్గొండలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read:
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో షాక్