Naim Sheikh: ఇదేం ట్రైనింగ్ భయ్యా.. నిప్పులపై నడిచిన బంగ్లా క్రికెటర్

ఆటలో సత్తా చాటాలని క్రికెటర్లు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫిటెనెస్‌ ట్రైనింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. క్రికెట్ లాంటి ఆటలో ఎంత ఫిట్‌గా ఉంటే అంత ఎక్కువ రాణించడంతో పాటు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బంగ్లా క్రికెటర్‌ చేసిన ట్రైనింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Naim Sheikh: ఇదేం ట్రైనింగ్ భయ్యా.. నిప్పులపై నడిచిన బంగ్లా క్రికెటర్

Naim Sheikh: ట్రైనర్ సలహా మేరకు నిప్పులపై..

ఉపఖండపు క్రికెటర్లకు వచ్చే మూడు నెలలు ఎంతో కీలకంగా ఉండనున్నాయి. ఎందుకంటే ఆసియాకప్‌తో పాటు వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలు జరగనున్నాయి. దీంతో ఈ రెండు టోర్నీల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిటెనెస్‌ ట్రైనింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. క్రికెట్ లాంటి ఆటలో ఎంత ఫిట్‌గా ఉంటే అంత ఎక్కువ రాణించడంతో పాటు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెటర్ మొహమ్మద్ నయీమ్ వినూత్న పద్ధతిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తన ట్రైనర్ సలహా మేరకు ఓ మైదానంలో నయూమ్‌ నిప్పులపై నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్‌‌ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోపై మిశ్రమ స్పందన..

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది. బంగ్లా క్రికెటర్ ట్రైనింగ్ వెరైటీగా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే.. ఇవేమి పిచ్చిపనులు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే నిప్పులపై నడవడం ద్వారా మెదడు చురుగ్గా మారి భయం పోతుందని ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బంగ్లా టీమ్ మేనేజర్‌‌ ఓ ఆర్టికల్‌ను తన ట్విట్టర్‌‌లో షేర్ చేశాడు. మొత్తానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ రెండు మెగా టోర్నీలను కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ జట్టు వన్డే కెప్టెన్‌గా తమీల్ ఇక్బాల్ తప్పుకోగా.. అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌ను సెలెక్టర్లు నియమించారు.

సెప్టెంబర్ 2న భారత్-పాక్ మ్యాచ్..

కాగా ఈ నెల 30 నుంచి పాకిస్థాన్‌, శ్రీలంక వేదికలుగా ఆసియాకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌ జట్టుతో పోటీ పడనుంది. ఇక ప్రపంచమంతా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్‌ మ్యాచ్ ఉంటుంది. ఇక భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభంకానుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

Also Read: ఈ కుర్రాడిని సానపెడితే మరో యువరాజ్‌, ధోనీ అవుతాడు భయ్యా! రాసి పెట్టుకోండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు