/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-25T191040.468-jpg.webp)
orange burfi: స్వీట్స్, డెజర్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొంత మంది ఎన్ని స్వీట్స్ ముందు పెట్టిన బోర్ ఫీల్ అవ్వకుండా తింటారు. ముఖ్యంగా డెజర్ట్స్ అంటే బాగా ఇష్టపడతారు. ఎప్పుడైనా పార్టీస్ లేదా ఫంక్షన్స్ లో హెవీ మీల్స్ తిన్న తర్వాత ఒక టేస్టీ డెజర్ట్ కడుపులో వేస్తే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డెజర్ట్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఫ్రైడ్, ఫ్రోజెన్, స్వీట్ డ్రింక్స్, పుడ్డింగ్స్, కస్టర్డ్ డెజర్ట్స్. చాలా మంది భోజనం తర్వాత ఎక్కువగా తీసుకునేది స్వీట్ డెజర్ట్స్. ఇప్పుడు ఇలాంటి డెజర్ట్ ప్రియుల కోసం నాగ్‌పూర్ స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.
ఆరెంజ్ బర్ఫీ కోసం కావాల్సిన పదార్థాలు
- ఆరెంజ్ పల్ప్ : 750 గ్రాములు
- షుగర్: 50 గ్రాములు
- తురిమిన కొబ్బరి: 100 గ్రాములు
- ఆరెంజ్ ఫుడ్ కలర్: ఇది మీ ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు లేదంటే మినహాయించండి
- మిల్క్ సాలీడ్స్ లేదా కోవా : 250 గ్రాములు
- సిల్వర్ వార్క్
Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!
ఆరెంజ్ బర్ఫీ తయారీ విధానం
- ముందుగా నారింజ పండ్లను శుభ్రంగా తొక్క తీసి.. వాటిలోని గింజలు కూడా తీసేయాలి. గింజలు అలాగే పెడితే చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తప్పకుండా తీసేయాలి. ఆ తర్వాత వీటి నుంచి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి.. దాంట్లో తీసి పెట్టిన ఆరెంజ్ పల్ప్ వేసి కాసేపు కుక్ చేయాలి.. ఆ తర్వాత షుగర్ యాడ్ చేసి కలుపుతూ ఉండాలి.
- ఇది కుక్ అవుతున్న సమయంలో అవసరమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.
- ఆ తర్వాత కుక్ అవుతున్న మిశ్రమంలో కోకోనట్ పౌడర్ యాడ్ చేసి.. అన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ.. సరైన కన్సిస్టెన్సీ వచ్చేవరకు కుక్ చేయాలి. ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉండాలి.
- చివరిగా మంచిగా కుక్ అయిన మిశ్రమాన్ని వెడల్పు ట్రై లోకి వేసి.. ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. తర్వాత దీన్ని సిల్వర్ వార్క్ తో టాప్ చేసి.. నాలుగు గంటల పాటు ఆ మిశ్రమాన్ని సెట్ అవ్వనివ్వాలి.
- ఫైనల్ గా ఈ ట్రే లో సెటైన మిశ్రమాన్ని మీకు కావాల్సిన ఆకారంలో స్క్వేర్, ట్రై యాంగిల్, సిర్కిల్ షేప్స్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ, యమ్మీ నాగ్‌పూర్ స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ రెడీ. భోజనం తర్వాత ఇది తింటే నెక్స్ట్ లెవెల్ అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.