తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి (Nagam Janardhan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నాగంను బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయమే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి.. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తాజా నాగం జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగడం కాంగ్రెస్ నేతలను కలవరానికి గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి: TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
Big Breaking: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Translate this News: