MWP Act: మీరు ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా? దీనితో పాటు ఏదైనా లోన్ ఉందా? లేదా మీరు ఎవరికైనా బాకీ ఉన్నారా? ఇన్సూరెన్స్ పాలసీకి లోన్స్ కి (Loans) లింక్ ఏమిటనుకుంటున్నారా? ఉంది. సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటె.. మనకు అనుకోని ఉపద్రవం ఏదైనా వచ్చి పడితే.. ఆ సొమ్ము మనపై ఆధారపడిన వారికీ భరోసాగా ఉంటుంది. అయితే, కొన్ని లోన్స్.. బాకీలు ఇలాంటి సందర్భంలో ఇన్సూరెన్స్ నుంచి రికవరీ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే బంధువులు కూడా మన ఇన్సూరెన్స్ సొమ్ము లాక్కునే ఆలోచనలు చేయవచ్చు. ఒక్కోసారి ఇన్సూరెన్స్ సొమ్ము మనవాళ్ళకి ఎంతమాత్రం పనికి రాకుండా పోయే అవకాశాలూ చాలా ఎక్కువ. ఇలా జరిగిన కేసులు చాలా వరకూ ఇంతకుముందు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఇలా రికవరీలు.. బంధువులు.. గొడవలు ఏవీ లేకుండా మన ఇన్సూరెన్స్ సొమ్ము మన వాళ్ళకే అంటే భార్య, పిల్లలకు మాత్రమే దక్కేలా చేసే ఏర్పాటు ఒకటి ఉంది. ఇది చాలామందికి తెలీదు.
అవును, 1874లో 'వివాహిత మహిళల ఆస్తి చట్టం' అని ఒకటి ఉంది. సంక్షిప్తంగా దీనిని MWPA (MWP Act)అని కూడా అంటారు. మీరు ఈ చట్టం పరిధిలో మీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, మీరు మరణిస్తే, మీ భార్య - పిల్లలకు మాత్రమే ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది. బంధువులు గానీ, ఏ బ్యాంకు గానీ, రుణ సంస్థ గానీ దాన్ని జప్తు చేయలేరు.
Also Read: SBI ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయ్.. మరి కొన్ని బ్యాంకుల్లో కూడా.. వివరాలివే..
MWP Act ఎలా పని చేస్తుంది?
వివాహిత మహిళల ఆస్తి చట్టంలోని సెక్షన్ 6, వివాహిత స్త్రీ లేదా ఆమె పిల్లలు ఆమె భర్త , బీమా పూర్తి మొత్తాన్ని పొందేలా నిర్ధారిస్తుంది. ఈ చట్టం ప్రకారం, ఏ రుణదాత లేదా ఏ బంధువులు తీసుకున్న టర్మ్ బీమా పాలసీ క్లెయిమ్ మొత్తాన్ని జప్తు చేయలేరు. ఇది మాత్రమే కాదు, మీ లోన్స్ తిరిగి చెల్లించడానికి MWP Act కింద తీసుకున్న పాలసీ నుంచి డబ్బును కూడా కోర్టు జప్తు చేయదు. ఇన్సూరెన్స్ విషయంలో, MWP Act ఒక ట్రస్ట్ లాగా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, పాలసీపై ట్రస్టీకి మాత్రమే నియంత్రణ ఉంటుంది. వారు మాత్రమే ఈ మొత్తానికి దావా వేయగలరు. దీని కోసం, వీలునామాలో భాగస్వాములైన ఎవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయలేరు. ఈ మొత్తం కేవలం వ్యక్తి భార్య - పిల్లలకు మాత్రమే చెందుతుంది.
MWP Act ఇన్సూరెన్స్ పాలసీని ఎలా తీసుకోవాలి?
దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు, మీరు దీని గురించి మీ ఇన్సూరెన్స్ ఎడ్వయిజర్ ని అడగాలి. ఫారమ్‌లో దీని కోసం ఇప్పటికే ఒక ఆప్షన్ ఉంది. దానిపై మీరు టిక్ చేయడం ద్వారా మీ సమ్మతిని ఇవ్వాలి. గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, మీరు MWP Act ప్రకారం పాలసీని తీసుకున్నట్లయితే, దానిని తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ మార్చలేరు.
Watch this interesting Video: