వారంలో అందుబాటులోకి ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో!

మరో వారం రోజుల్లో ముంబై అండర్ గ్రౌండ్ లైన్ మెట్రో అందుబాటులోకి రానుంది. జూలై 24 నుంచి ఈ భూగర్భ మెట్రో అందుబాటులోకి వస్తుందని మైగవ్ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. రూ.37,275.50 కోట్ల వ్యయంతో, జైకా రుణంతో దీనిని నిర్మించారు.

వారంలో అందుబాటులోకి ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో!
New Update

ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో 3 లేదా ఆక్వా లైన్ జూలై 24 నుండి పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ మైగవ్ఇండియా మంగళవారం ఎక్స్ లో తెలిపింది. ఇది ముంబైలో తొలి భూగర్భ మెట్రో మార్గం. దీనినే ఆక్వా లైన్ అని కూడా అంటారు. ఇది కొలాబా-బాంద్రా-సీప్జెడ్ ల మధ్య జూలై 24న ప్రారంభం కానుంది.

భూ గర్భ మెట్రో 3 ఆరే కాలనీ నుండి కఫ్ పరేడ్ వరకు 33.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో 27 స్టాప్ లు ఉంటాయి. ఇది ముంబై ప్రజా రవాణా ముఖ చిత్రాన్ని మారుస్తుందని, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మైగవ్ ఇండియా ఒక చిన్న వీడియో క్లిప్ తో సహా ఒక పోస్ట్ లో తెలిపింది.

#mumbai-underground-metro
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe