ఏ డ్రెస్ లో నైనా గ్లామ‌ర్ లుక్‌తో అలరిస్తున్న మృణాల్..

హీరోయిన్లు కొంద‌రిని ట్రెడిష‌న‌ల్ లుక్‌లో చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకొంద‌రికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంత‌మంది మాత్ర‌మే ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఎంత అందంగా అనిపిస్తారో.. గ్లామ‌ర్ లుక్‌తో అంత‌గా ఆక‌ర్షిస్తారు. ఇలాంటి కోవ‌కు చెందిన అమ్మాయే మృణాల్ ఠాకూర్.

New Update
ఏ డ్రెస్ లో నైనా గ్లామ‌ర్ లుక్‌తో అలరిస్తున్న మృణాల్..

హీరోయిన్లు కొంద‌రిని ట్రెడిష‌న‌ల్ లుక్‌లో చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇంకొంద‌రికి సెక్సీ లుక్ బాగుంటుంది. కానీ కొంత‌మంది మాత్ర‌మే ట్రెడిష‌న‌ల్ లుక్‌లో ఎంత అందంగా అనిపిస్తారో.. గ్లామ‌ర్ లుక్‌తో అంత‌గా ఆక‌ర్షిస్తారు. ఇలాంటి కోవ‌కు చెందిన అమ్మాయే మృణాల్ ఠాకూర్. సీతారామంలో ఆమె ముగ్ధ మ‌నోహ‌ర‌మైన అందంతో క‌ట్టి ప‌డేసింది. అదే స‌మ‌యంలో బాలీవుడ్లో చేసిన కొన్ని చిత్రాల్లో సూప‌ర్ సెక్సీగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఫొటో షూట్ల విష‌యంలోనూ ఇలాగే రెండు ర‌కాలుగా మెప్పిస్తుంటుంది మృణాల్. తాజాగా బాంబే టైమ్స్ ఫ్యాష‌న్ వీక్‌లో చూడ‌ముచ్చ‌టైన అందంతో మెప్పిస్తూనే.. అందాల ఆర‌బోత‌లోనూ వారెవా అనిపించింది మృణాల్.

పింక్ క‌ల‌ర్ లెహెంగాలో పొద్దిక అందాలు ఆర‌బోస్తూ కుర్రకారును క‌ట్టి ప‌డేసింది మృణాల్. ర్యాంప్ మీద అలా న‌డిచి వ‌స్తుంటే శృంగార దేవ‌తే మృణాల్‌ను పూనిందా అనిపించేలా ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఈ ఫ్యాష‌న్ షో తాలూకు ఫొటోలు ఇలా సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చాయో లేదో.. అలా వైర‌ల్ అయిపోయాయి. మృణాల్ పేరు కూడా ట్విట్ట‌ర్లో ట్రెండ్ అవుతోంది.

తెలుగు సినిమాల్లో ఇప్ప‌టిదాకా చేసిన పాత్ర‌ల‌తో అందంతో క‌ట్టి ప‌డేస్తూనే అభిన‌యంతోనూ మెప్పించి చూస్తుండ‌గానే స్టార్ హీరోయిన్ అయిపోయింది మృణాల్. ఇటీవ‌ల ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్ట‌ర్ అయినా.. మృణాల్‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి. తెలుగులో మున్ముందు ఇంకా పెద్ద స్టార్ల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల్లో క‌నిపించ‌బోతోంది మృణాల్. ఇంకో ఐదారేళ్లు ఆమె కెరీర్‌కు ఢోకా లేన‌ట్లే క‌నిపిస్తోంది.
Advertisment
తాజా కథనాలు