AP: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!

మా నాన్న మిస్సింగ్ వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడే కారణమని ఎంపీడీఓ వెంకటరమణరావు తనయుడు మహేంద్ర ఆరోపించారు. చేయని తప్పుకు కోటి రూపాయలు డబ్బులు కట్టమని ఒత్తిడి తెచ్చారని.. మరో ఏడాదిలో రిటైర్ అవ్వాల్సిన మా తండ్రి ఇలా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
AP: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!

MPDO Venkataramana Rao Issue: నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎంపీడీవో తనకు రాసిన లేఖలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలన్నారు. మిస్సింగ్ కు కారుకులైన అందరినీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎంపీడీఓ వెంకటరమణరావు తనయుడు మహేంద్ర RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. మా నాన్న మిస్సింగ్ వెనుక నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడే కారణమని ఆరోపించారు.  చేయని తప్పుకు కోటి రూపాయలు డబ్బులు కట్టమని ఒత్తిడి తెచ్చారని.. మరో ఏడాదిలో రిటైర్ అవ్వాల్సిన మా తండ్రి ఇలా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి.!

వైసీపీ నాయకులు, జడ్పీ సీఈవో డబ్బులు కట్టాలని ఒత్తిడి తెచ్చారని..ఫెర్రీ నిర్వాహకుడు తప్పించుకుని తిరుగుతున్న పట్టించుకోలేదని అన్నారు. 'మా నాన్నతో చివరిగా 15వ తేదీ మాట్లాడాను. పిల్లలు మీ అందరూ జాగ్రత్త అంటూ చివరిగా మాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ద్వారా న్యాయం జరుగుతుందని ఆయనకి లేఖ రాశారు. మా నాన్నకి జరిగిన అన్యాయంపై ఒకసారి పవన్ కళ్యాణ్ కలుస్తాం' అని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏలూరు కాలవలో ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ రైల్వే స్టేషన్ లో దిగిన ఎంపీడీవో..రైల్వే స్టేషన్ నుంచి కాలవ కట్ట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నడిచినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో కాలవలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లు పెద్దగా శబ్దం వచ్చిందంటున్నారు స్థానికులు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తండ్రి ఆచూకీ కోసం కుమారులు నిన్నంత ఏలూరు కాలవ కట్టపైనే ఎదురుచూశారు. నేడు కూడా గాలింపు చర్యలు కొనసాగనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు