లియో స్కామ్.. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్.!

దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. అయితే సెకండ్ డే నుంచి ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కానీ నిర్మాత మాత్రం సూపర్ హిట్ అంటూ కలెక్షన్స్ మ్యానేజ్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారంట. దీంతో ట్విట్టర్ లో లియో స్కామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

లియో స్కామ్.. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్.!
New Update

Leo Movie Making Difference in Collections: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. ఈ సినిమాకి ఉన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ అయితే గట్టిగా వచ్చాయి. మొదటి రోజు భారీ వసూళ్ళని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే సెకండ్ డే నుంచి ఒక్క తమిళనాడులో తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాలలో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అయితే మూవీ నిర్మాత, యూనిట్ మాత్రం లియో సూపర్ హిట్ అంటూ ప్రచారం చేయడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు కలెక్షన్స్ దాటేసినట్లు ఫిగర్స్ చూపిస్తున్నారు.

Also Read: వెంకీ మామ కూతురు ఎంగేజ్ మెంట్.!

అలాగే ఓవర్సీస్ లో 18 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది అంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా మూవీ సక్సెస్ అంటూ కథనాలు వైరల్ చేస్తున్నారు. రియాలిటీలో మాత్రం ఈ సినిమాకి వస్తోన్న ఆదరణ వాస్తవ విరుద్ధంగా ఉంది. దసరా టైంలో కూడా పెద్దగా థియేటర్స్ ఫిల్ అయినట్లు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాలలో అయితే లియో పూర్తిగా పడిపోయింది. భగవంత్ కేసరి సక్సెస్ కావడంతో ఆడియన్స్ అందరూ ఆ సినిమా చూడటానికి మొగ్గు చూపిస్తున్నారు. సెకండ్ ఛాయస్ గా టైగర్ నాగేశ్వరరావు మూవీ చూస్తున్నారు.

లియో సినిమా ఇప్పటికే చాలా థియేటర్స్ ఖాళీ అయిపొయింది. అయితే తమ మూవీ సూపర్ హిట్ అంటూ మూవీ యూనిట్ సక్సెస్ మీట్ లు కూడా పెడుతోంది. తమిళనాడులో కూడా కలెక్షన్స్ పెద్దగా లేవని అంటున్నారు. కానీ నిర్మాత మాత్రం సూపర్ హిట్ అంటూ ప్రచారం చేయడానికి, వెబ్ సైట్స్, ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్స్ మ్యానేజ్ చేస్తూ పూర్తిగా బయటకి రాకుండా జాగ్రత్త పడుతున్నారంట. దీంతో తాజాగా ట్విట్టర్ లో లియో స్కామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. లియో కలెక్షన్స్ అన్ని కూడా అబద్ధం అని దళపతి యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. వాస్తవ విరుద్ధంగా ఎంత ప్రచారం చేసుకున్న సినిమా సూపర్ హిట్ కాదని కౌంటర్ లు వేస్తున్నారు.

#leo-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe