/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T165751.463.jpg)
డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. సూచిస్తున్నారు.మెంతులు.. రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఎన్నో రోగాలను ఇట్టే మాయం చేసే శక్తి మెంతులకు ఉంది. అందుకే మన పూర్వీకులు వంటలో మెంతులు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది మెంతుల వాడకాన్ని తగ్గించేశారు. అయితే.. మళ్లీ మెంతులు వాడకం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. అంతేకాదు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. 1 టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.ప్రతి రోజు రాత్రిపూట 2 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.