Expensive Cigarette: ఈ సిగరెట్ తాగాలంటే మీ జేబులో వేలల్లో డబ్బు ఉండాల్సిందే..!

Expensive Cigarette: ఈ సిగరెట్ తాగాలంటే మీ జేబులో వేలల్లో డబ్బు ఉండాల్సిందే..!
New Update

Expensive Cigarette Brand: భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల రూపాయల విలువైన సిగరెట్లు అమ్ముడవుతున్నాయి. ప్రపంచం మొత్తం మార్కెట్ చూస్తే ఈ మార్కెట్ చాలా పెద్దదని క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోతుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ ఖరీదు ఎంతో తెలుసా? ఈ ఖరీదైన సిగరెట్ పేరు ఏంటో తెలుసా? కొందరు మాత్రమే ఆస్వాదించగలిగే ఈ సిగరెట్ పేరు ఏంటి? దాని ధర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్..

ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగరెట్ పేరు ట్రెజరర్ లగ్జరీ బ్లాక్ సిగరెట్. బ్లాక్ అండ్ గోల్డెన్ బాక్స్ లో వచ్చే ఈ సిగరెట్ ఎవరి జేబులోనైనా ఉందంటే.. వారు ఖచ్చితంగా ధనవంతుడే అయి ఉంటారని అర్థం చేసుకోవచ్చు. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర సుమారు రూ.5,500. ఇక దీని తరువాత రెండవ అత్యంత ఖరీదైన సిగరెట్ ట్రెజరర్ అల్యూమినియం గోల్డ్ సిగరెట్. ఈ సిగరెట్ బంగారు, తెలుపు రంగులలో వస్తుంది. ఒక్క పెట్టె ధర 5,000 రూపాయలు ఉంటుంది.

మూడు, నాలుగు స్థానాల్లో ఉండే సిగరెట్లు ఇవే..

మూడవ స్థానంలో ఉన్న సిగరెట్ పేరు సోబ్రానీ బ్లాక్ రష్యన్స్ సిగరెట్. ఇది రష్యన్ సిగరెట్. ఈ సిగరెట్‌లో ప్రత్యేకత ఏంటంటే.. వివిధ దేశాల నుంచి తెచ్చిన పొగాకుతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 1000 రూపాయలు. నాలుగవ స్థానంలో ఉన్న సిగరెట్ నాట్ షెర్మాన్ సిగరెట్.

ఇది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన సిగరెట్ బ్రాండ్. ఈ సంస్థ గత 100 సంవత్సరాలుగా పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ సిగరెట్‌ ప్యాకెట్‌ ధర 850 రూపాయలు. ఇక 5వ స్థానంలో ఉన్న సిగరెట్ విషయానికొస్తే.. ఈ సిగరెట్ పేరు మార్ల్‌బోరో వింటేజ్ సిగరెట్. ఈ బ్రాండ్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు రూ.815.

Also Read:

మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ..

తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే..

#expensive-cigarette-brand
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe