Health Tips : హైపర్ టెన్షన్ లేదా హైబీపీని నిర్లక్ష్యం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. రక్తపోటు అదుపులో ఉండాలంటే ఆహారంలో మార్పులు తప్పనిసరి. కాబట్టి అధిక రక్తపోటు లేదా బీపీని తగ్గించుకోవడానికి మార్నింగ్ డైట్ లో చేర్చుకోవాల్సిన కొన్ని డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం.
టొమాటో జ్యూస్:
టొమాటో జ్యూస్ ఈ జాబితాలో మొదటిది. 100 గ్రాముల టొమాటోలో 237 మి.గ్రా పొటాషియం ఉంటుంది. వాటిలో లైకోపీన్ కూడా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట టమోటో జ్యూస్ తాగడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
క్యారెట్ జ్యూస్:
ఈ జాబితాలో రెండవది క్యారెట్ రసం. విటమిన్ ఎ, సి అధికంగా ఉండే క్యారెట్ జ్యూస్‌ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బిపిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
బీట్ రూట్ జ్యూస్:
జాబితాలో తదుపరిది బీట్‌రూట్ రసం. దుంపలలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలించడం, అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది.
ఆరేంజ్ జ్యూస్:
ఈ జాబితాలో నారింజ జ్యూస్ నాల్గవ స్థానంలో ఉంది. ఫైబర్, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నారింజ రసాన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా బిపి తగ్గుతుంది.
స్ట్రాబెర్రీ జ్యూస్:
జాబితాలో తదుపరిది స్ట్రాబెర్రీ రసం. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: ఆధార్ ఫ్రీ అప్డేట్ పొడిగింపు..గడువు మరో మూడు నెలల..ఇలా అప్ డేట్ చేసుకోండి..!